IMD issues Orange alert for next three days for Hyderabad హైదరాబాదుకు ఆరెంజ్ అలర్ట్: రానున్న 3 రోజులు నగరంలో భారీ వర్షాలు

Imd issues orange alert for next three days for hyderabad and parts of telangana

rain alert for telangana, weather updates, telangana weather news, rain alert hyderabad, rains in hyderabad, rain in telangana, imd rain alert, telangana weather news, telangana rains, weather updates, imd rain alert for Andhra pradesh, imd rain alert for telangana, rain alert, rains in telangana, imd rain alert, hyderabad rains, yellow alert, weather updates, telangana weather news, telangana, weather

The Indian Meteorological Department on Thursday issued a alert to Hyderabadis and few districts of telangana for the next three days for heavy rains and thunder storms that are likely to occur in parts of Telangana. The IMD issues Orange alert to Greater Hyderabad.

హైదరాబాదుకు ఆరెంజ్ అలర్ట్: రానున్న 3 రోజులు నగరంలో భారీ వర్షాలు

Posted: 09/08/2022 12:36 PM IST
Imd issues orange alert for next three days for hyderabad and parts of telangana

తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిన్న మధ్యహ్నాం నుంచి వర్షం దంచికొట్టింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, పరిసర ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్‌లో పలు చోట్ల వర్షం ఏకధాటిగా కురిసింది. మధ్యమధ్యల కాసింత సమయం విరామాన్ని ఇస్తూనే రాత్రి ఒంటిగంట వరకు వర్షం కుమ్మేసింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం మరో అప్రమత్తతను జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది.

వర్షాకాలం ప్రారంభం నుంచి ఆగస్టు వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతానికి బదులు దాదాపుగా రెట్టింపు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జంట జలాశయాలు పూర్తి నీటిమట్టం స్థాయికి చేరుకోవడం.. అయినా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరు అధిక మొత్తంలో నమోదు కావడంతో.. గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కారణంగా ఎన్నడూ లేని విధంగా ముసారాంబాగ్ వంతెనను వరద నీరు తాకడంతో దానిపై నుంచి వాహనాల రాకపోకలను నిషేధించిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో అనేక ఇళ్లు, అపార్టుమెంట్లు పూర్తిగా జలమయం అయ్యాయి. వీటన్నింటినీ అనుభవించి ఇప్పుడిప్పడే కాసింత ఉపశమనంతో ఉన్న నగర ప్రజలకు మరోమారు వాతావారణ శాఖ అధికారులు పిడుగులాంటి వార్తను తెలిపారు. రాత్రి 9గంటల వరకు అల్వాల్‌లోని మచ్చబొల్లారంలో అత్యధికంగా 9.3సెం.మీలు, అత్యల్పంగా గచ్చిబౌలిలో 1.0సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్‌ అధికారులు వెల్లడించారు. రహదారులపై వర్షంనీరు చేరడంతో వెంటనే స్పందించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, మాన్‌సూన్‌ సిబ్బంది నీటిని తొలగించారు.

ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో అక్కడక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. వరదనీరు మూసారాంబాగ్‌ బ్రిడ్జిని ముంచెత్తడంతో పోలీసు అధికారులు వాహనాలను దారిమళ్లించారు. వరదనీరు తగ్గేవరకు గోల్నాక బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలు సాగాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం రాగల 24గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో గ్రేటర్‌ పరిధిలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌కు ఆరెంజ్‌ అలర్ట్‌ హెచ్చరికలు జారీచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles