IMD issues yellow alert for tomorrow in parts of Telangana తెలంగాణ వ్యాప్తంగా నేడు సాధారణ, రేపు భారీ వర్షాలు..

Imd issues yellow alert for tomorrow in parts of telangana heavy rains continue to pound

Rain in Hyderabad, Rain in Telangana, yellow alert, telanagana, meteorological department, cyclonic, bay of bengal, upper air cyclonic circulation, Peddapalli, Jayashankar Bhupalpally, Mulugu, Bhadradri Kothagudem, Khammam, Nalgonda, Suryapet, Mahabubabad, Medak, Warangal rural districts, heavy flood flow, musarambhag bridge close, hyderabad floods, musi floods

The Met Department, issued yellow alert for heavy rains at several places over the next 48 hours. Officials said light to moderate rain or thundershowers were likely at many places across the Stated during the next 24 hours, But Heavy to very Heavy rains to lash parts of Telangana during the next 24 hours.

తెలంగాణ వ్యాప్తంగా నేడు సాధారణ, రేపు భారీ వర్షాలు..

Posted: 08/02/2022 12:50 PM IST
Imd issues yellow alert for tomorrow in parts of telangana heavy rains continue to pound

తెలంగాణపై వరుణుడు ప్రతాపం చాటుతూనే ఉన్నాడు. గడిచిన రెండు నెల్లలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురియడంతో.. చెరువులు, వాగులు, వంకలు అన్ని నిండు కుండలను తలపిస్తున్నాయి. అయినా వరుణుడు శాంతించడం లేదు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు తెలంగాణకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది భారత వాతావరణశాఖ. కాగా ఇవాళ ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణ శాఖ రేపు (బుధవారం) మాత్రం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడి చత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించినట్టు తెలిపింది. దీనికి తోడు తమిళనాడుపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు పేర్కొంది. వీటి ప్రభావంతోనే వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. దీంతో అన్ని జిల్లా అదికార యంత్రాలకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర యంత్రాంగం అదేశాలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చర్యలు చేపట్టాలని అదేశించారు.

ఇక ప్రమాదస్థాయిలో ఉన్న నిర్మాణాలను గుర్తించి.. వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు నిర్మాణాల యజమానులకు నోటీసులు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్న కూడా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలోని బంట్వారంలో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లాలోని అబ్దుల్ నాగారంలో అత్యల్పంగా 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత నెలలో తెలంగాణలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతానికి (252.6 మిల్లీ మీటర్లు) మించి 300 శాతం అదనపు వర్షపాతం (1011.2 మిల్లీ మీటర్లు) నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది. జులై నెలలో ఈ స్థాయిలో వర్షాలు పడడం చాలా అరుదని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles