Adhir apologises to President over 'rashtrapatni' remark రాష్ట్రపతికి క్షమాపణ పత్రం పంపిన కాంగ్రెస్ నేత

Congress leader s written apology to president for rashtrapatni remark

Adhir Ranjan Chowdhury, Droupadi Murmu, Rashtrapatni remark, Rashtrapatni remark row, Adhir Ranjan Chowdhury apologises to President Droupadi Murmu, Adhir Ranjan apology, President of India, National Politics

Congress Lok Sabha MP Adhir Ranjan Chowdhury, who has stoked a controversy by calling newly elected President Droupadi Murmu "Rashtrapatni", issued an apology in a letter to her on Friday, claiming that it was a "slip of the tongue".

రాష్ట్రపతికి క్షమాపణ పత్రం పంపిన కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్

Posted: 07/29/2022 08:00 PM IST
Congress leader s written apology to president for rashtrapatni remark

రాష్ట్ర‌ప‌తిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌధ‌రి త‌న వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తడంతో దిగివ‌చ్చారు. ఆయన నోరు జారీన అదే రోజన తొలుత క్షమాపణ చెప్పేదే లేదని అన్న ఆయన.. ఆ వెంటనే క్షమాపణలు చెప్పారు. తాను కేవలం ఒక్కసారి నోరు జారీ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును ఉద్దేశించి రాష్ట్రపత్ని అని అన్నానని.. కానీ బీజేపి నేతలు మాత్రం దీనిని తమ రాజకీయ లబ్దికి వాడుకునేందుకు దానిని రోజుల తరబడి వివాదాస్పదం చేస్తూ.. విపక్షాలను దేశప్రజలు ఎదుర్కోంటున్న సమస్యల నుంచి పక్కదారి పట్టేలా చేస్తోందని అన్నారు.

కాగా, అధీర్ రంజన్ చౌదరీ చెప్పిన క్షమాపణ కన్నా.. క్షమాపణ చెప్పేదే లేదన్న మాటలే అధికంగా వైరల్ కావడంతో ఇక ఈ అంశాన్ని ఇంతటితో తన తరపున ముగింపు పలకాలని భావించిన ఆయన తన క్షమాపణను ఏకంగా రాష్ట్రపతికి తెలిపారు. అదెలా అంటే.. శుక్ర‌వారం లేఖ రాసిన అధిర్ ఆమెను క్ష‌మాప‌ణ కోరారు. మీరు నిర్వ‌హిస్తున్న ప‌దవిని ఉద్దేశించి పొర‌పాటున స‌రికాని ప‌దాన్ని వాడినందుకు విచారం వ్య‌క్తం చేస్తున్నాన‌ని రాష్ట్ర‌ప‌తి ముర్ముకు రాసిన లేఖ‌లో అధిర్ రంజ‌న్ పేర్కొన్నారు.

పొర‌పాటున నోరు జారి ఆ ప‌దాన్ని వాడినందుకు క్ష‌మాప‌ణ కోరుతున్నాన‌ని దీన్ని మీరు అంగీక‌రించాల‌ని కాంగ్రెస్ నేత ఆ లేఖ‌లో కోరారు. అధిర్ అంత‌కుముందు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును ఉద్దేశించి రాష్ట్ర‌ప‌త్నిగా వ్యాఖ్యానించిన వీడియో క్లిప్ పెనుదుమారం రేపింది. అధిర్ త‌న వ్యాఖ్య‌ల‌పై క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో నిర‌స‌న చేప‌ట్టారు. అధిర్ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్ష‌మాప‌ణ‌కు కేంద్ర మంత్రులు స్మృతి ఇరాని, నిర్మ‌లా సీతారామ‌న్ డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles