Ram Gopal Varma booked for cheating కోర్టు అదేశాలతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు.!

Hyderabad cheating case filed against ram gopal varma

Ram Gopal Varma, Ram Gopal Varma case, Ram Gopal Verma, Ram Gopal Varma police, Ram Gopal Varma news, Ram Gopal Varma, RGV cheating case, rgv, rgv cheating case, telugu film disha, Miyapur police, Film financier, Court directions, Hyderabad, Crime

A cheating case has been registered against filmmaker Ram Gopal Varma by police here for allegedly cheating a proprietor of a production house after “borrowing” Rs 56 lakh from him. Based on a court referred complaint from the proprietor, a case was booked against Varma under relevant IPC sections at Miyapur police station, police said.

కోర్టు అదేశాలతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు.!

Posted: 05/25/2022 05:20 PM IST
Hyderabad cheating case filed against ram gopal varma

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన.. ఇటీవలి కాలంలో వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. తన చిత్రాలన్నీ వివాదాలతో ముడి పడటంతో అలా అయ్యిందో లేక.. తనకే వివాదాలు ఇష్లమయ్యాయో కానీ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. హైదరాబాద్ లో ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. తనను మోసం చేసిన దర్శకుడు డబ్బులు తీసుకున్నాడన్న పిర్యాదు మేరకు కేసు నమోదైంది.

ఓ సినిమా కోసం రూ.56 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసం చేశారంటూ ఓ ఫైనాన్షియర్ ఫిర్యాదు చేశారు. తనకు డబ్బును తిరిగి ఇప్పించాలని కోర్టులో దావా వేశారు. దీంతో దర్శకుడిపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం పోలీసులను అదేశించింది. దీంతో మియాపూర్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద వర్మపై కేసు నమోదు చేశారు. ‘‘2019లో నా స్నేహితుడి ద్వారా వర్మతో పరిచయం ఏర్పడింది. 2020లో దిశ సినిమా కోసం నా దగ్గర డబ్బు తీసుకున్నారు. ఆ ఏడాది జనవరిలో రూ.8 లక్షలు ఇచ్చాను. ఆ తర్వాత మరోమారు రూ.20 లక్షలు ఇవ్వాల్సిందిగా వర్మ విజ్ఞప్తి చేయడంతో 2020 జనవరి 22న ఆ డబ్బు కూడా చెక్ రూపంలో ఇచ్చాను.

ఆరు నెలల్లో తిరిగిచ్చేస్తానంటూ వర్మ చెప్పారు. ఆ తర్వాత అదే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో ఆర్థిక కష్టాలున్నాయని చెప్పి మరో రూ.28 లక్షలు తీసుకున్నారు. దిశ సినిమా విడుదలైన రోజు లేదా అంతకన్నా ముందే తిరిగిచ్చేస్తానని హామీ ఇవ్వడంతో ఆయన్ను నమ్మి డబ్బులిచ్చాను’’ అని ఫైనాన్షియర్ చెప్పారు. అయితే, ఆ సినిమాకు వర్మ నిర్మాత కాదని తర్వాత తెలిసిందని, వర్మ తప్పుడు హామీలకు మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన డబ్బును తిరిగిప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మియాపూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles