Rachakonda CI steals money from the thief's bank account దొంగోడి బ్యాంక్ అకౌంట్ కు కన్నం పెట్టిన సర్కిల్ ఇన్స్ పెక్టర్

Rachakonda ci facing theft charges after stealing money from the thief s bank account

Theft Case, Accused, Juditial Remand, Bank Account, Debit Card, Police Siezure, Bank Officials, Internal investigation, Rachakonda police, Telangana, Crime

One man went to jail on a charge of theft. On his way to jail, the police took his belonging and seized them. A circle inspector used a debit card to withdraw money from the accused's account. The affair is currently causing a stir. Rachakonda police are conducting an internal inquiry into the matter.

దొంగోడి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేసిన సర్కిల్ ఇన్స్ పెక్టర్

Posted: 05/10/2022 06:32 PM IST
Rachakonda ci facing theft charges after stealing money from the thief s bank account

పరాయి సోమ్ము పాముతో సమానం అనేవాళ్లు మన పూర్వికులు. అంటే అది విషంతో సమానమని.. లేదా ఆ డబ్బును ఆశిస్తే.. అది ఏదో ఒక పూట కాటేస్తుందని అర్థం ఆ మాట వెనుక దాగివుంది. కానీ ఈ కాలంలో ఎన్ని ప్రకృతి వైపరిత్యాలు జరుగుతున్నా.. మనిషి అన్నవాడికి స్వార్థం తప్ప.. ఏ కోశాన నీతి, నిజాయితీ అన్నది కనిపించడం లేదు. ధనం మూలమ్ ఇదం జగత్ అన్నట్లు.. యావత్ ప్రపంచం డబ్బు చుట్టే తిరుగుతోంది. అయితే ఇలా పరాయి సొమ్మును ఆశించడం, కాజేయడం పాపమే కాదు నేరం కూడా. ఇలాంటి చర్యలకు ఎవరైన పాల్పడితే.. వారిపై పోలీసులకు పిర్యాదు చేస్తాం.

అయితే పోలీసులే ఇలా పరాయి వ్యక్తుల సోమ్ముకు ఆశపడితే.. ఏం చేస్తాం. ఔనా.. నిజంగానా.. ఉన్నాతాధికారులను ఆశ్రయించడం తప్ప ఏం చేస్తాం. అదే జరిగింది. ఒక వ్యక్తిపై దొంగతనం అభియోగం మోపబడి జైలుకు వెళ్లాడు. అతను జైలుకు వెళ్లే క్రమంలో అతని నుంచి లభించిన వస్తువులను పోలీసులు తీసుకుని భద్రపర్చారు. అలా భద్రపర్చిన వస్తువుల్లోంచి డెబిట్ కార్డు తీసి.. దాని ద్వారా నిందితుడి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకుని వాడేసుకున్నాడు ఓ సర్కిల్ ఇన్స్ పెక్టర్. ఈ వ్యవహారం ప్రస్తతం సంచలనాన్ని రేకెత్తించింది. ఈ వ్యవహారంపై రాచకొండ పోలీసులు అంతర్గత విచారణ జరుపుతున్నారు.

అసలేం జరిగిందీ అన్న వివరాల్లోకి వెళ్తే.. రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ఓ దోంగ పట్టుబడ్డాడు. కొన్ని రోజుల క్రితం ఈ దొంగ బేగంబజార్‌ పరిధిలో టైర్లు దొంగిలించి పట్టుబడ్డారు. సదరు నిందితుడు జైల్లో ఉన్నప్పుడు అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి ఇన్స్‌పెక్టర్ రూ. 5 లక్షలు స్వాహా చేశాడు. ఫిబ్రవరిలో చోరీ కేసులో నిందితుడు అగర్వాల్‌ని రాచకొండ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో అగర్వాల్ డెబిట్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. బెయిల్‌పై బయటికి వచ్చాక అకౌంట్ చెక్ చేయగా.. తన ఏటీఎం కార్డు నుంచి భారీ గా నగదు విత్ డ్రా చేసినట్టు గుర్తించాడు.

బ్యాంకుకు వెళ్లి వివరాలు సేకరించగా ఏటీఎం ద్వారా డబ్బు డ్రా అయినట్లు తెలుసుకున్నాడు. దీంతో పోలీసులు సీజ్ చేసిన ఏటీఎం కార్డు నుంచి పోలీసు కస్టడీలో ఉండగా, అందులోంచి లక్షల రూపాయల డబ్బులు పోయాయంటూ సదరు దొంగ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ అంతర్గత విచారణ జరిపించారు. ఓ ఇన్స్పెక్టర్ నిందితుడి ఏటీఎం కార్డ్ ద్వారా రూ. 5 లక్షలు డ్రా చేసినట్లు గుర్తించినట్టు ప్రాథమిక సమాచారం. కాగా ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles