Brinda Karat Blocks Bulldozer, Waves Court Papers జహంగీర్ పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత.. ‘సుప్రీం’ జోక్యంతో..

Sc stays demolition delhi civic body continues drive in violence hit jahangirpuri

Delhi Hanuman Jayanti Violence, Delhi Jahangirpuri Violence news, Delhi Demolition Drive, Jahangirpuri Demolition Drive, Aam Admi Party, AAP, jahangirpuri, CPM leader, Brinda Karat, anti-encroachment drive, North Delhi Municipal Corporation, Delhi-Jahangirpuri Demolition Drive, Jahangirpuri Demolition Drive News,Delhi latest news, Jahangirpuri News, Jahangirpuri Communal Violence, delhi violence, Demolition drive in Jahangirpuri

Supreme court has ordered a stay on the Jahangirpuri demolition drive that the North Delhi Municipal Corporation undertook to remove encroachments. The SC ordered a status quo on the demolition drive till it heard the case. CPM leader Brinda Karat was seen blocking a bulldozer and waving the copy of a Supreme Court order, in dramatic visuals from a tense two-hour standoff during which the civic body refused to stop its "anti-encroachment drive" despite the court's order.

జహంగీర్ పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత.. ‘సుప్రీం’ జోక్యంతో..

Posted: 04/20/2022 12:23 PM IST
Sc stays demolition delhi civic body continues drive in violence hit jahangirpuri

రెండు వర్గాల మధ్య అల్లర్లతో అట్టుడికిన ఢిల్లీలోని జహంగీర్ పురిలో అధికారులు పటిష్ఠ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఓ వర్గం వారు రాళ్లు రువ్వడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, జహంగీర్ పురిలో అల్లర్లకు కారణమైన వారి అక్రమ నిర్మాణాలను కూల్చేయాలంటూ బీజేపీ ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా.. ఎన్డీఎంసీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ కు లేఖ రాశారు. స్థానిక ఎమ్మెల్యే అండదండలు చూసుకునే అల్లర్లకు పాల్పడిన వాళ్లు రెచ్చిపోయారని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) మేయర్ ఆదేశాల మేరకు 400 మంది పోలీసు బలగాల బందోబస్తు నీడలో అధికారులు అక్కడకు చేరుకున్నారు. అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేయడం ప్రారంభించారు. అల్లర్ల కోసం వాడిన గాజు సీసాలను దాచిన స్క్రాప్ గోదాములను మొత్తం కూల్చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, రోడ్డు పక్కన ట్రాఫిక్ కు ఆటంకం కలిగించేలా ఉన్న కట్టడాలు, షాపులనూ కూల్చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

సుప్రీంకోర్టు జోక్యంతో..

అయితే, ఎలాంటి నోటీసులు లేకుండా ఉన్నపళంగా కూల్చివేతలంటే రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవడంతో.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కూల్చివేతలను ఆపివేయాలంటూ ఎన్డీఎంసీకి ఆదేశాలిచ్చింది. ఈ వ్యవహారంపై రేపు మరోసారి విచారిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు కూల్చివేతల వ్యవహారంపై విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. కాగా, జహంగీర్ పురి అల్లర్లకు సంబంధించి ఇప్పటిదాకా ఇద్దరు మైనర్లు సహా 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీలో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. ఒక వర్గాన్ని టార్గెట్‌ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నోటీసు, కోర్టుకెళ్లే అవకాశం లేకుండా నేరుగా పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని దుయ్యబట్టారు. పేద ముస్లింలకు బతుకే లేకుండా చేస్తున్నారని ఒవైసీ మండిపడ్డారు. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీపై ధ్వజమెత్తింది. దేశ రాజధానిలో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించేందుకు బీజేపీ, అమిత్ షా కుట్ర చేస్తున్నారని ఆరోపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles