WHO warned against the new virus strain ‘XE’ ఆందోళన కలిగిస్తున్న కరోనా ‘ఎక్స్ఈ వేరియంట్’..

New covid variant xe found in uk more transmissible than omicron who

Covid-19 alert, WHO, new virus strain XE, XE, new covid strain, xe variant, new covid variant, omicron, covid fourth wave, new covid wave

A new mutant of the novel coronavirus known as XE appears to be around ten per cent more transmissible than the BA.2 sub-variant of Omicron, as per the World Health Organisation. Until now, the BA.2 sub-variant of Omicron was considered the most contagious strain of Covid-19. If this new research is confirmed, it would make XE the most transmissible Covid-19 mutant yet.

ఆందోళన కలిగిస్తున్న కరోనా ‘ఎక్స్ఈ వేరియంట్’.. వేగంగా వ్యాప్తి..

Posted: 04/04/2022 06:26 PM IST
New covid variant xe found in uk more transmissible than omicron who

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని సంబరపడుతున్న వేళ.. ప్రజలకు ఏమాత్రం విముక్తిని కల్పించకుండా మరో వేరియంట్ పుట్టుకొచ్చింది. కరోనా అల్ఫా, బీటా తరువాత డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ల తరువాత గతేడాది పుట్టుకోచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్ కరోనా వైరస్ లో మరో స్టెయిన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన వేరియంట్లలో ఓమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతుండగా, అందులోనూ పలు సబ్ వేరియంట్లలో.. అన్నింటికంటే ‘ఎక్స్ఈ’ అత్యంతవేగంగా వ్యాప్తిచెందుతుందని తేలడం గమనార్హం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర అందోళన చెందుతున్నారు.

దీనికి వేగంగా వ్యాప్తిచెందే లక్షణం ఉండడంతో నిపుణులు అప్రమత్తమయ్యారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ అయిన ‘బీఏ.1, బీఏ.2’ల మిశ్రమ వేరియంటే ఎక్స్ఈ. బీఏ.2 కంటే ఇది 10 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. ఇప్పటికే ఒమిక్రాన్ లోని బిఏ 2 సబ్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు వ్యాప్తిస్తున్న క్రమంలో ఇక తాజాగా ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ కూడా మానవాళిపై జడలు విప్పి కరాళనృత్యం చేస్తుంది. దీంతో అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత ఎక్కువగా ఒమిక్రాన్ బిఏ 2 కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్.. బిఏ 1, బిఏ 2 వేరియంట్ల ఉత్పరివర్తన రకం వైరసే ఎక్స్ఈ. ఈ నేపథ్యంలో ప్రపంచ అరోగ్య సంస్థ కూడా అప్రమత్తమైంది. ఈ ఎక్స్ఈ రకం కరోనా వేరియంట్ తొలుత లండన్ లో కనుగోన్నారు. ఇదో కొత్తరకం స్టెయిన్ లా వుందని వైద్యనిపుణులు పరీక్షల అనంతర తెలుసుకున్నారు. మాస్కుల వినియోగంపై నిర్లక్ష్యం వద్దని హెచ్చరిస్తున్నారు. మాస్కులు తీసే సమయం ముందు ఉందని, ఇప్పటికైతే వాటిని ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్ఈ ఉత్పరివర్తనలో తీవ్రత, లక్షణాలను గుర్తించేవరకు ఇది ఓమిక్రాన్ ఉప వేరియంట్ గానే పరిగణిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ‘ఎక్స్ఈ’ వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లోనూ మళ్లీ అది విజృంభించే అవకాశాన్ని కొట్టిపడేయలేమని, కాబట్టి కొత్తకేసుల్లో పెరుగుదల కనిపించనంత వరకు కొవిడ్ నిబంధనలను కొనసాగించాలని ప్రభుత్వానికి నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ కొత్త వేరియంట్ వల్ల మరీ అంతగా భయపడాల్సిన అవసరం లేదని, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 600 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : xe variant  new covid variant  omicron  covid fourth wave  new covid wave  

Other Articles