BJP MP Roopa Ganguly breaks down in RS రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్న అధికార మహిళా ఎంపీ..

Bjp mp roopa ganguly breaks down in parliament over bengal violence case

Roopa Ganguly breaks down in Rajya Sabha, Roopa Ganguly breaks down in Parliament, BJP woman MP breaks down in Rajya sabha, BJP woman MP breaks down Parliament, BJP woman MP, Roopa Ganguly on Birbhum violence, Roopa Ganguly on Birbhum killings, Roopa Ganguly breaks down, Roopa Ganguly, Breaks down, BJP, West Bengal, Parliament, Birbhum killings, Birbhum violence, Roopa Ganguly, Politics

BJP MP Roopa Ganguly was seen breaking down in Rajya Sabha while speaking about the violence in Bengal’s Birbhum district where eight people were burnt to death after the murder of a Trinamool Congress leader. In parliament, the BJP MP alleged that "mass murders have become common in West Bengal" as she demanded imposition of the President's rule.

ITEMVIDEOS: రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్న అధికార మహిళా ఎంపీ..

Posted: 03/25/2022 06:05 PM IST
Bjp mp roopa ganguly breaks down in parliament over bengal violence case

పార్లమెంటులో ఓ మహిళా ఎంపీ కన్నీరు పెట్టుకున్నారు. అధికార బీజేపి పార్టీకి చెందిన మహిళా ఎంపీ తమ రాష్ట్రాన్ని అదుకోవాలని అమె నిండు సభలో కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాదు తమ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను పెట్టాలని అమె అసలు విషయాన్ని కూడా సభలో నోక్కిచెప్పారు. ఇంతకీ ఎవరా అధికార పార్టీకి చెందిన మహిళా ఎంపీ అంటే అమె రాజ్యసభ సభ్యురాలు రూపా. గతంలో అమె భారత నటిగా, నేపథ్య గాయనిగా రాణించారు. టీవీ మహాభారత్ లో ద్రౌపతి వేషధారిణిగా అమె గుర్తింపు పొందారు. దీంతో అమెను బీజేపి పార్టీ రాజ్యసభ్యకు ఎంపిక చేసింది. ఇటీవల బీజేపి పార్టీ తరపున పశ్చిమ బెంగాల్ నుంచి చట్టసభలకు పోటీ చేసిన ఆమెకు పరాభవం తప్పలేదు.

కాగా, ఇవాళ రాజ్యసభలో అమె కన్నీటి పర్యంతమవుతూ.. తమ రాష్ట్రంలో శాంతిభద్రతలకు పదే పదే విఘాతం కలుగుతోందని ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రజలు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో తమ రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. రాజ్య‌స‌భలో ఇవాళ ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. ఇటీవ‌ల బీర్బ‌మ్‌లో జ‌రిగిన హింస గురించి ఆమె జీరో అవ‌ర్‌లో ప్ర‌స్తావించారు. కేవ‌లం 8 మంది మాత్ర‌మే మ‌ర‌ణించార‌ని, అంత క‌న్నా ఎక్కువ లేద‌ని ఆమె బెంగాల్ ప్ర‌భుత్వాన్ని ప‌రోక్షంగా విమ‌ర్శించారు. రూపా మాట్లాడుతున్న స‌మ‌యంలో తృణ‌మూల్ ఎంపీలు స‌భ‌లో ఆందోళ‌న సృష్టించారు.

అటాప్సీ రిపోర్ట్ ప్ర‌కారం.. తొలుత అక్క‌డ వాళ్ల‌ను కొట్టిన‌ట్లు తెలుస్తోంద‌న్నారు. కొట్టిన త‌ర్వాత సామూహిక హ‌త్య‌లు జ‌రిగిన‌ట్లు రూపా ఆరోపించారు. బెంగాల్‌ నుంచి జ‌నం పారిపోతున్నార‌ని గంగూలీ ఆరోపించారు. భార‌త్‌లో బెంగాల్ భాగ‌మ‌ని, అక్క‌డ జీవించే హ‌క్కు ఉంద‌ని, మేం బెంగాల్‌లో పుట్టామ‌ని, అక్క‌డ పుట్ట‌డం త‌ప్పుకాదు అని, మ‌హాకాళి భూమి అని ఆమె ఆవేశంగా మాట్లాడారు. భావోద్వేగంతో ఏడ్చేశారు. ఆ స‌మ‌యంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. తృణ‌మూల్ ఎంపీలు నినాదాల‌తో హోరెత్తించారు. దీంతో స‌భ‌ను వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles