Hyderabad: 11 dead in fire at scrap godown బోయిగూడలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం

11 charred to death in massive fire in timber godown in secunderabad

scrap shop fire in hyderabad, scrap shop fire hyderabad, Hyderabad Fire Accident, Hyderabad Fire, Hyderabad scrap shop fire, Hyderabad fire. Massive fire accident in Hyderabad, massive fire accident in scrap shop, massive fire accident in secundrabad, massive fire accident in Bhoiguda, massive fire accident in shadwan traders, massive fire accident in scrap collection shop,, massive fire accident, scrap shop, timber shop, bhoiguda, bihar migrant labourer, shadwan traders, Hyderabad, Telangana, crime

At least 11 people were killed in a fire at a scrap godown in Hyderabad's Bhoiguda area early on Wednesday. One of the workers who managed to escape from the godown was rushed to a hospital. According to the police, 12 workers were asleep on the first floor of Shadwan traders' scrap collection centre when the fire broke out on the ground floor.

బోయిగూడలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది వలస కార్మికుల సజీవదహనం

Posted: 03/23/2022 11:29 AM IST
11 charred to death in massive fire in timber godown in secunderabad

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం సంభవించింది. బుధవారం వేకువ జామున.. మరికొద్ది గంటల వ్యవధిలో తెల్లవారుతుందనగా, సికింద్రాబాద్‌ బోయగూడలో భారీ అగ్నిప్రమాదంలో వలసకార్మికులు బతుకులు అనంతవాయువుల్లో కలసిపోయాయి. చుట్టూ దట్టమైన పొగలు, ఎగిసిపడుతున్న మంటలు, మాంసం ముద్దలుగా 11 మంది బీహార్ కు చెందిన కార్మికుల మృతదేహాలు తమను కాపాడే అభయహస్తాల కోసం వేచిచూస్తూ చెల్లాచెదురుగా పడివున్నాయి. అసలేం జరిగిందో కూడా పరిసర ప్రాంతాలవారీకి తెలియని అయోమయ పరిస్థితి. ప్రమాద సంఘటన సమాచారం అందుకున్న పోలీస్, ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపకదళాలు మంటలను అదుపు చేసేందుకు గంటల సమయం శ్రమించాల్సి వచ్చింది.  

అగ్నిప్రమాద సమయంలో టింబర్‌ డిపోలో 15 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మృతులంతా బిహార్‌కు చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో టింబర్‌ డిపోతోపాటు స్క్రాప్‌ గోదాం కూడా ఉంది. టింబర్‌ డిపో నుంచి స్క్రాప్‌ గోదాంకు మంటలు వ్యాపించినట్లు సమాచారం. కనీసం ఎవరి మృతదేహాలు ఎవరివో చెప్పలేని విధంగా కాలిపోయారు. దీంతో మృతులను గుర్తించేందుకు గాంధీ వైద్యులకు డీఎన్ ఏ పరీక్షలు చేయకతప్పని పరిస్థితి నెలకొంది. మంటలు ఎగిసిపడుతున్న సమయంలో గోదాం లోపల ఉన్న కార్మికులు తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు.

అయితే గోదాంలో ఒక్కటే ప్రవేశం ఉండటంతో వారు తప్పించుకునే వీలుకాకపోవడంతో ఆ మంటలలోనే కాలిపోయారు. సంఘటన చోటు చేసుకున్న సమయంలో కార్మికులంతా నిద్రపోతున్నారని సమాచారం. మంటల దాటికి నిద్ర లేచినప్పటికీ తప్పించుకునే మార్గం లేక అగ్నికి ఆహుతయ్యారు. ఓ వైపు మంటలు ఎగిసి పడుతుండగా మరోవైపు తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేసినట్లుగా అక్కడక్కడ పడి ఉన్న మృతదేహాలను బట్టి తెలిసింది. అయితే కిటికీ నుండి బయటకు దూకిన ప్రేమ్ అనే కార్మికుడు ప్రాణాలతో బయట పడ్డాడు. స్క్రాప్ గోదాంను అనుసరించి ఉన్న వెల్డింగ్ షాప్, కేబులో గోదాంలకు మంటలు వ్యాప్తి చెందాయి.

ఈ సంఘటనలో కేబుల్ గోదాంలో ఉన్న కేబుల్స్ కు మంటలు అంటుకుని పూర్తిగా దహనమైంది. మొత్తం మీద ఇక్కడి పరిస్థితి సినిమాలోని దృశ్యాలను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తుండగా సిలిండర్ పేలుడు కూడా జరిగి ఉండవచ్చనే అభిప్రాయాన్ని అక్కడున్నవారు వ్యక్తం చేశారు. మృతులలో 9 మంది మృతదేహాలు గుర్తుపట్టని విధంగా మాడిపోయాయి. దీంతో అన్ని మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు చేయక తప్పని పరిస్థితి నెలకొందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రమాద సంఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సీఎం అధికారులను ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles