Arumugasamy Commission summons Apollo doctors మాజీ సీఎం జయలలిత కేసులో అపోలో వైద్యులకు సమన్లు

Jayalalithaa s death commission summons 10 doctors from apollo hospitals

Justice A Arumughaswamy Commission, Apollo Hospitals, cardiac arrest, treatment, Health Secretary J Radhakrishnan, O Panneerselvam, Jayalalithaa, Edappadi K Palaniswami, V K Sasikala, Tamil Nadu, Chennai, Crime

The Justice A Arumughaswamy Commission, which is inquiring into the circumstances that led to the death of former Chief Minister J Jayalalithaa, summoned 10 doctors from Apollo Hospitals who were part of the panel that treated her. This is the first time that the commission has issued summons after it resumed hearing in the case last month.

తమిళనాడు మాజీ సీఎం జయలలిత కేసులో అపోలో వైద్యులకు సమన్లు

Posted: 03/03/2022 01:46 PM IST
Jayalalithaa s death commission summons 10 doctors from apollo hospitals

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన రిటైర్డు జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ తొలిసారిగా అపోలో వైద్యులకు నోటీసులు జారీ చేసింది. 2016 సెప్టెంబర్ 22న అపోలో అసుపత్రిలో చేరిన అమెకు అనారోగ్యం కారణంగా ఏకంగా నెలల తరబడి చికిత్సను అందించిన వైద్యులను విచారించేందుకు కమీషన్ ఈ నోటీసులను జారీచేసింది. ఎయిమ్స్‌ వైద్యుల సహకారంతో ఈనెల 7వ తేదీ నుంచి దర్యాప్తును వేగవంతం చేయనుంది. గత అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమీషన్ దాదాపుగా ఐదు నెలల సమయాన్ని వాయిదాల పర్వాన్ని కొనసాగించింది.

తాజాగా దర్యాప్తును ముమ్మరం చేయాలని నిర్ణయానికి వచ్చిన కమీషన్.. తొలిసారిగా అపోలో వైద్యులకు నోటీసులు జారీ చేయడం.. వారు జయలలితకు అమె అసుపత్రిలో ఉన్న 75 రోజుల కాలానికి ఎలాంటి చికిత్సను అందించార్న విషయంలో ఎయిమ్స్ వైద్యుల సహకారాన్ని కూడా తీసుకోనుంది. అదే సమయంలో తమను విచారణ పరిధిలోకి ఈ కమిషన్‌ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రెండేళ్ల కాలం వృథా అయ్యింది. గత ఏడాది పగ్గాలు చేపట్టిన డీఎంకే సర్కారు సైతం ఈ  కమిషన్‌ పదవీ కాలాన్ని పొడిగించి విచారణను త్వరితగతిన ముగించాలని ఆదేశించింది.

అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఆర్ముగ స్వామికి సహకారంగా ఎయిమ్స్‌ వైద్యులను సుప్రీంకోర్టు రంగంలోకి దించింది. గత నెల ఈ వైద్య బృందంతో కమిషన్‌ వర్గాలు సమావేశమయ్యాయి. వైద్యపరంగా తమకు ఉన్న అనుమానాల్ని నివృతి చేసుకున్నారు. ఇక, వీరి సహకారంతో విచారణను వేగవంతం చేసి ప్రభుత్వానికి మరికొన్ని నెలల్లో నివేదిక సమర్పించేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అప్పట్లో జయలలితకు చికిత్స అందించిన అపోలో వైద్యులను ఈ కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles