Mohan Babu, Vishnu in land dispute మోహన్ బాబు, విష్ణులకు నిరుపేదల కోటాలో భూమి.?

Mohan babu manchu vishnu alloted dkt land in landless poor quota

MAA President, Manchu Vishnu, Mohan babu, survey number 412-1a, 412-1b, Rs 7crore worth land, Ramireddy Palli, Chandragiri, Chittoor district, tollywood

A theft was reported at the office of Movie Artist Association (MAA) president Manchu Vishnu in Film Nagar, Hyderabad. In his office, the actor had reportedly preserved a few valuable pieces of hairdressing equipment. Vishnu, along with his manager Sanjay, has complained with the police about the theft.

సినీనటుడు మోహన్ బాబు, మంచువిష్ణులకు నిరుపేదల కోటాలో భూమి.?

Posted: 03/01/2022 02:10 PM IST
Mohan babu manchu vishnu alloted dkt land in landless poor quota

సినీనటుడు మంచు మోహన్ బాబు, మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణులపై ఇప్పటికే నాయిబ్రాహ్మణ సంఘాలు రెండు రోజుల వ్యవధిలో బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మంచువిష్ణు వ్యక్తిగత హెయిర్‌ స్టైలిస్ట్‌ నాగశ్రీనుపై వారు అనుచితంగా వ్యవహరించారని, అందుకు సంబంధించిన ఫూటేజీ వారి సిసిటీవీల్లోనే లభ్యం అవుతుందని కూడా అరోపిస్తున్న నేపథ్యంలో నిజానిజాలు ఏంటో తెలియాల్సి వుంది. అయితే మంచు విష్ణు మేనేజర్ సంజయ్ నాగశ్రీనుపై జూబ్లీహిల్స్‌ పోలిస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇదిలావుండగా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వారికి సంబంధించిన ఓ వ్యవహారం తాజాగా వెలుగుచూడటం చర్చనీయాంశంగా మారింది.

మోహన్‌బాబు, మంచు విష్ణు నిరుపేదలా? అంటే ఔను అనే అంటున్నారు నెటిజనులు. మంచు విష్ణు, మోహన్ బాబు నటించిన చిత్రాలు వరుసగా ప్రేక్షకాదరణ పోందడం లేదని.. వీటిలో వారు సొంత బ్యానర్ లో రూపోందించిన చిత్రాలు కూడా వున్నాయని దాంతో చిత్రాలు కనీస అంచనాలు కూడా అందుకోకపోవడంతో వారు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని కూడా ప్రచారం జరుగుతోంది. అంతమాత్రన వారు పేదోళ్లు ఎలా అవుతారన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయినా.. వారు చిత్రాలతో పాటు పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. మనం చర్చించుకోవడం పక్కన బెడితే ఇప్పుడీ విషయమై సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఎందుకు అన్న వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌లోని సాగు భూమి లేని నిరుపేదలకు కేటాయించే దరఖాస్తు పట్టాలు వారిపేరిట మంజూరు కావడమే ఈ చర్చకు కారణం. ఆన్‌లైన్ రెవెన్యూ రికార్డుల్లో నమోదైన ఈ వివరాలు వెలుగులోకి రావడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి-68 గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 412-1ఎలోని 2.79 ఎకరాలను మోహన్‌బాబు పేరిట, 412-1బిలో 1.40 ఎకరాలను విష్ణు పేరిట దరఖాస్తు పట్టా జారీ చేశారు. 2015లోనే దరఖాస్తు పట్టాలు మంజూరు చేయగా ఆ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనమయ్యాయి. ఈ విషయమై స్పందించిన తహసీల్దారు శిరీష పూర్తి వివరాలు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles