దురదృష్టమేంటో కానీ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా కొన్నిసార్లు దొరికిపోతుంటారు కొందరు. ఈ విషయంలో విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేసేవారు ముందు వరుసలో ఉంటారు. శరీర అంతర్భాగాల్లో దాచుకుని స్మగ్లింగ్ చేసినా పట్టుబడి కటకటాల పాలవుతుంటారు. తాజాగా, అలాంటి అనుభవమే ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి ఎదురైంది. కాలేజీలో చదువుకుంటూ నిత్యం తన గర్ల్ ఫ్రెండ్ గురించి అలోచించి.. చదువుపై శ్రద్ద వహించలేక పోతున్న విద్యార్థి.. తన హాస్టల్ గదికే గర్ల్ ఫ్రెండ్ ను తీసుకువస్తే ఎంత బాగుండు. ఇద్దరం కలసి ఎంచక్కా చదువుకోవచ్చు. ఇక ముచ్చట్లు కూడా పెట్టుకోవచ్చు అనుకున్నాడు.
అయితే తన హాస్టల్ లోకి గర్ల్ ఫ్రెండ్ ను తీసుకురావడం ఎలా అని విపరీతంగా అలోచించాడు. ఓ మంచి ప్లాన్ వేశాడు. అంతే ఇక ఆలస్యం చేయకుండా తన ప్లాన్ ను అదే కాలేజీలో చదువుకుంటున్న గార్ల్ ఫ్రెండ్‌తో పంచుకున్నాడు. అమె కూడా ప్రియుడి ఫ్లాన్ కు అంగీకరించింది. అనుకున్నదే తడవుగా ఓ పెద్ద ట్రాలీ సూట్‌కేసులో అమ్మాయిని కుక్కేసి ఎవరికీ అనుమానం రాకుండా హాస్టల్‌కు తెచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, ప్లాన్ బెడిసికొట్టడంతో కాలేజీ నుంచి ఇద్దరూ సస్పెండయ్యారు. కర్ణాటకలోని ఎంఐటీ మణిపాల్ హాస్టల్లో జరిగిందీ ఘటన.
అంతపెద్ద ట్రాలీ సూట్‌కేసును లాక్కొస్తున్న విద్యార్థిని గమనించిన హాస్టల్ వార్డెన్ అనుమానంతో అతడిని ఆపాడు. అందులో ఏమున్నాయని ప్రశ్నించాడు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువులు ఉన్నాయని బదులులిచ్చాడు. అయితే, విద్యార్థి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో ట్రాలీని బలవంతంగా తెరిపించాడు. ఆ వెంటనే అందులోంచి బయటపడిన అమ్మాయిని చూసి వార్డెన్ అవాక్కయ్యాడు. దీంతో ఇద్దరినీ సస్పెండ్ చేసి ఇంటికి పంపారు.
You are not a true lover , if you can’t fit into a suitcase .( just a suitcase ad in manipal.#manipal pic.twitter.com/kqnyTvmHWe
— haridev kt (@haridev_kt) February 2, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more