No night curfew in Telangana: health director నైట్ కర్ఫ్యూపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు కీలక ప్రకటన

Telangana high court summons director of public health to appear

omicron cases in Hyderabad, omicron cases in GHMC, omicron cases in Telangana, positivity rate in hyderabad, positivity rate in GHMC, positivity rate in Telangana, positivity rate in Medak, positivity rate in kothagudem, coronavirus, new variant, Omicron, Delta variant, DH Srinivas Rao, Night Curfew, Positivity rate, omicron cases in Hyderabad, GHMC, Telangana, crime

Telangana High Court Chief Justice Satish Chandra Sharma, during the course of adjudication of a batch of PILs and writ petitions on Covid observed that people who are violating the guidelines are not being penalised.

నైట్ కర్ఫ్యూపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు కీలక ప్రకటన

Posted: 01/25/2022 04:50 PM IST
Telangana high court summons director of public health to appear

రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా కేసులు లేవని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ అవసరమని పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.16 లక్షల మందికి ప్రికాషనరీ డోసు ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు ఇప్పటికే హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఒక్క జిల్లాలోనే పాజిటివిటీ రేటు 10 శాతం మించలేదని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జనం గుమికూడకుండా ఈ నెల 31 వరకు ఆంక్షలు విధించామన్నారు.

పాజిటివిటీ రేటు మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 6.45 శాతం ఉండగా, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14 శాతం ఉందని వెల్లడించారు. ఇక జీహెచ్‌ఎంసీలో 4.26 శాతం, మేడ్చల్‌లో 4.22 శాతంగా ఉందన్నారు. ఐసీయూ, ఆక్సిజన్‌ పడల ఆక్యుపెన్సీ 6.1 శాతంగా ఉందని చెప్పారు. వారం రోజులుగా రోజుకు లక్షకుపైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వర సర్వే జరుగుతొందని, మూడు రోజుల్లోనే 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేశామన్నారు. 15 నుంచి 18 ఏండ్లలోపువారిలో 59 శాతం మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని వెల్లడించారు. ఇదిలావుండగా తెలంగాణలో కోవిడ్ ఆంక్షల అమలుపై తెలంగాణ హైకోర్టు పలు సూచనలు చేసింది.

కోవిడ్ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటీషన్లు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ ప్రభుత్వానికి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓ ప్రకారం, కోవిడ్ నిబంధనలు పాటించని వారి నుంచి జరిమానాలు వసూళ్ల చేయడం లేదని పిటీషన్లపై విచారించిన న్యాయస్థానం.. మాస్క్‌లు ధరించని, సామాజిక దూరం పాటించకుండా ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని ఆయన రాష్ట్ర పోలీసులు, జిహెచ్‌ఎంసిని ఆదేశించారు. ఇక ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావును ఈ నెల 28 తమ ఎదుట హాజరు కావాలని ఆయన అదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles