Will commit suicide if casino allegations proved: Kodali Nani క్యాసినో రగడ.. గుడివాడలో ఉద్రిక్తత.. టీడీపీ నేతల అరెస్టు

Videos of sankranthi casino in andhra go viral cops order probe

sankranti casino row in Andhra Pradesh, Goa style Casino in Andhra Pradesh, kodali nani Convention Hall Casino, Gudivada Casino row, Telugu desam party, TDP protest, Krishna district, Tension, TDP Nijanirdharana committee, Goa style casino, Kodali Nani, Convention Hall, Gudivada, Krishna, Andhra pradesh, Crime

Amid the continuing row over the casino organised at K. Convention Hall at Gudivada in Krishna district during Sankranti and the protest by opposition Telugu Desam Party (TDP) demanding action against him, the minister told reporters that if the allegations were proved he would not only quit politics but would also pour petrol and set himself ablaze.

క్యాసినో రగడ.. గుడివాడలో ఉద్రిక్తత.. టీడీపీ నేతల అరెస్టు

Posted: 01/21/2022 03:07 PM IST
Videos of sankranthi casino in andhra go viral cops order probe

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి వేళ కోడి పందేలతో అలరాడాల్సిన ప్రాంతం క్యాసినో రగడతో రగిలిపోతోంది. కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో నిర్వహించిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ నేడు వెళ్ల‌నున్న నేప‌థ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెల‌కొంది. టీడీపీ కమిటీ స‌భ్యులు, మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్రతో పాటు ప‌లువురు నేత‌లు, కార్య‌కర్త‌లు గుడివాడ‌కు రాకుండా పోలీసులు భారీగా మోహ‌రించారు. అంతేకాకుండా కొడాలి కన్వెన్షన్ సెంటర్‌కు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి కొడాలి నాని తన సొంత కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించడంపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్యాసినో నిర్వహణపై వాస్తవాలు తెలుసుకునేందుకు టీడీపీకి చెందిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు, శ్రేణులు గుడివాడకు రాగా వారిని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు కూడా పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున రావడంతో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ క్రమంలో అప్పటికే అక్కడకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలు అగ్రహంతో రగలిపోయి టీడీపీ నేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పట్టణంలోని నాగవర్పాడు సెంటర్‌లో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నగరంలో బారికెడ్లు, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుని రాళ్లు రువ్వడంతో పాటు అక్కడి వాహనాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.

కాగా క్యాసినో నిర్వహణపై టీడీపీ నాయకులు బొండ ఉమ, వర్ల రామయ్య మాట్లాడుతూ ..సంక్రాంతి సంబరాల పేరిట లేని సంప్రాదాయం, సంస్కృతిని తీసుకొచ్చిన మంత్రి కొడాలి నానిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. సంక్రాంతి పండుగకు పాశ్చాత్య సంస్కృతిని తీసుకొస్తున్న మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహణపై తమ వద్ద పూర్తి ఆదారాలున్నాయని నాయకులు పేర్కొన్నారు. కొడాలి నాని క్యాసినో కథేంటో సీఎం జగన్‌ తేల్చాలని డిమాండ్‌ చేశారు. కొడాలి నానికి డబ్బు పిచ్చి పట్టి అమ్మాయిలను గోవా నుంచి తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారని ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని పేర్కొన్నారు. క్యాసినో వ్యవహారం మీకు తెలిసే జరుగుతుందా.? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే క్యాసినో అకృత్యాలు జరుగుతుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని , కేసును డీజీపీ నీరుగార్చే ప్రయత్నాలు చేస్తే న్యాయపరంగా వెళ్తామని నాయకులు వెల్లడించారు. త‌మ ప‌ర్య‌ట‌న‌ను ఎవ్వ‌రూ ఆప‌లేర‌ని కొల్లు ర‌వీంద్ర అన్నారు. గుడివాడ‌లో ఎన్నిక‌ల్లోనూ టీడీపీ జెండాను ఎగ‌వేస్తామ‌ని కొడాలి నానికి ఈ సంద‌ర్భంగా తాము చెబుతున్నామ‌ని సవాల్ చేశారు. చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు ఇంకా ఎన్నాళ్లు సాగుతాయ‌ని ఆయ‌న నిల‌దీశారు. టీడీపీలో ఉన్నంతకాలం కొడాలి నాని బాగున్నాడని.. వైసీపీలోకి వెళ్లిన తర్వాతే బూతుల మంత్రిగా, పేకాట మంత్రిగా.. ఇప్పుడు కేసినో మంత్రిగా కూడా మారారని... రానున్న రోజుల్లో ఆయన అరాచకం ఏ స్థాయికి చేరుకుంటుందో ఊహించడానికే కష్టంగా ఉందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles