Philippines Super Typhoon Rai death toll surges భీకర బీభత్సం సృష్టించిన రాయ్ తుపాన్.. 208 మంది మృతి

Death toll from super typhoon rai climbs toat least 208 in the philippines

Typhoon Rai, Typhoon Rai in Philippine, Philippine death toll, Typhoon Rai death toll, Philippines, Rai Typhoon, typhoon, cyclone, cyclonic storm

The death toll from the strongest typhoon to hit the Philippines this year has surged to 208, the national police said Monday, making it one of the deadliest storms to hit the country in recent years. At least 239 people were injured and 52 were missing after Typhoon Rai ravaged the southern and central regions of the archipelago, the police tally showed.

భీకర బీభత్సం సృష్టించిన రాయ్ తుపాన్.. 208 మంది మృతి

Posted: 12/20/2021 10:45 AM IST
Death toll from super typhoon rai climbs toat least 208 in the philippines

ఫిలిప్పీన్స్​లో ‘రాయ్‌’ తుఫాను భీకర విధ్వంసం సృష్టించింది. సముద్రం కల్లోలంగా మారి ఫిలిఫ్పిన్స్ తీరాన్ని తాకడంతో.. బీభత్సం తాండవించింది. రాయ్ తుఫాను ధాటికి ఆ దేశంలో ఏకంగా 208 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. దేశంలో తుఫాను ధాటికి ఇటీవల కాలంలో ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారని అదేశ అధికారిక వర్గాలు తెలిపాయి. తుఫాను ధాటికి ఏకంగా 52 మంది అదృశ్యంకాగా, 239 మంది క్షతగాత్రులయ్యారని ఫిలిఫ్పిన్స్ పోలీసు అధికారులు వెల్లడించారు. రాయ్ తుపాను తీరం తాకిన ఆర్చిపెలాగోలోని దక్షిణ, సెంట్రల్ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది.

గురువారం రోజున ఒక్క ఉదుటున తమ దేశంపై పడిన రాయ్ తుఫాను ధాటికి సముద్రపు ఒడ్డును ఆనుకుని వున్న బీచ్ లలోని రిసార్టులు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయని అవేదన వ్యక్తం చేశారు. ఈ భయానక తుఫాను ధాటికి ఏకంగా 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. కోస్తా ప్రాంతాల్లో పూర్తిగా కొట్టుకుపోయి.. కేవలం శిధిలాలు మాత్రమే మిగిలాయని అన్నారు, తుపాను కారణంగా వీచిన ఈదురు గాలుల ధాటికి అనేక ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. తీర ప్రాంతం మొత్తం తుడుచుపెట్టుకుపోయిందని ఫిలిప్పీన్స్‌ రెడ్‌క్రాస్‌ తెలిపింది.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచార, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా సెంట్రల్​ ఫిలిప్పీన్స్​లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. తీర ప్రాంతంలోని ఇళ్లు, పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలన్నీ కుప్పుకూలిపోయి.. శిధిలాలుగా మారాయని రెడ్‌క్రాస్ ఛైర్మన్ రిచర్డ్ గోర్డాన్ తెలిపారు. సుమారు మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. రాయ్​ తుఫాను కారణంగా గంటకు 195-270 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. గాలుల ధాటికి భారీ వృక్షాలు నెలకొరిగాయని, చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Philippines  Rai Typhoon  typhoon  death toll  cyclone  cyclonic storm  

Other Articles