Telangana to experience drop in temperatures రానున్న రోజుల్లో తెలంగాణలో పెరగనున్న చలి తీవ్రత

Telangana to experience drop in mercury in forth coming days

Telangana weather, Telangana temperatures, Telangana State Development Planning Society, Hyderabad weather, Kumarambheem Asifabad, Dip in mercury, low temp in Telangana, Asifabad, Adilabad, Mancherial, Sangareddy, BHEL, Rajendranagar, Hyderabad, Telangana

As days are expected to turn colder in the State as it’s experiencing a drop in minimum temperature each day. As per the Telangana State Development Planning Society, temperature at the night is likely to drop to 12 degree Celsius in Kumarambheem Asifabad, Adilabad and 13 degree Celsius at Sangareddy, Medak and Mancherial in the course of the next three days.

రానున్న రోజుల్లో తెలంగాణలో పెరగనున్న చలి తీవ్రత

Posted: 11/09/2021 01:51 PM IST
Telangana to experience drop in mercury in forth coming days

రోజురోజుకూ తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. మధ్య నవంబర్ నెలలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. సాయంత్రం ఆరు గంటలకే రాష్ట్రంలో చలి అలుముకుంటోంది. దీంతో రాజధాని హైదరాబాద్ నగరంలోనూ రాత్రి తొమ్మిది గంటల తరువాత ట్రాఫిక్ పెద్దగా రోడ్లపై కనిపించడం లేదు. నవంబర్ నెలాఖరు వచ్చే సరికి రాష్ట్రంలో పరిస్థితులు మరింత మారుతాయని, చలి తీవ్రత మరింత పెరుగుతోందని ప్రజలు భావిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు కూడా విరివిగా కురిసన నేపథ్యంలో చలి తీవ్రత కూడా అధికంగానే వుంటుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, రానున్న మూడురోజుల్లో కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌లలో రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాలలో 13 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఎక్కడా వర్షపాతం నమోదు కాకపోవడం కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడానికి కారణంగా చెప్పుకోచ్చారు. దీంతో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిన్నెదారిలో 13.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రత 36.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని తెలిపారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని రాజేంద్రనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 16.8 డిగ్రీల సెల్సియస్‌, అత్యధికంగా షాపూర్ నగర్‌లో 32.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కాగా, గత రెండేళ్ల కిందట అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతగా 6.6 డిగ్రీల సెల్సియన్ ను నమోదు చేసుకున్న బిహెచ్ఈఎల్ ప్రాంతంలోనూ ఈ సారి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు వున్నాయి. ఇక గచ్చిబౌలి ప్రాంతంలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం విధులకు వెళ్లేందుకు ఉద్యోగులు కార్లనే వాడేందుకు ఇష్టపడుతున్నారు. కాగా, రాష్ట్రంలో ఉదయం వేళల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles