swati nakshatra pooja perfomerd at Yadadri యాదాద్రిలో వైభవంగా స్వాతి నక్షత్రపు పూజలు..

Special poojas performed at yadadri temple on auspicious day

Astothara Shatha Ghatbhisekham, Balalayam, Swathi Nakshatra, Yadadri, Yadadri Sri Lakshminarsimha Swamy Temple, Yadadri-Bhongir, Devotional

Astothara Shatha Ghatbhisekham was performed at Yadadri Sri Lakshminarsimha Swamy temple by the temple priests in view of Swathi Nakshatra on Saturday. The temple witnessed huge rush of devotees on Weekend.

యాదాద్రిలో వైభవంగా స్వాతి నక్షత్రపు పూజలు..

Posted: 09/11/2021 12:06 PM IST
Special poojas performed at yadadri temple on auspicious day

తెలంగాణ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇవాళ స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించాయి. యాదాద్రి మహాలయం పునర్నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్న క్రమంలో బాలాలయంలో స్వామివారి జన్మ నక్షత్రయుక్తమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సంప్రదాయ రీతిలో విశేష పూజలు కొనసాగాయి. వేకువ జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు బాలాలయంలోని కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ కల్యాణ మండపంలో 108 కలశాలకు పూజలు జరిపారు.

పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవ మూర్తులను, ప్రతిష్ఠ అలంకార మూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్ర నామార్చనలు జరిపారు. ఇక సాయంత్రం స్వామి అమ్మవార్లను రథసేవలో తీరిదిద్ది బాలాలయ మండపంలో ఊరేగించనున్నారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు వేకువ జామునే గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వాతి నక్షత్రం తో పాటు శనివారం కూడా కావడం వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. ఇక అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles