Girl's Gymnastics Routine Impressed Netizens చిన్నారి జిమ్నాస్టిక్స్ టాలెంట్ కు నెటిజనులు ఫిదా..!

Viral video this girl s gymnastics routine impressed nadia comaneci virender sehwag

Nadia Comaneci, Virender Sehwag, Gymnastics, Twists and turns, Little Girl, gymnastics, Viral Video, Social media

If a five-time Olympic gold medallist finds something to praise in a young girl's gymnastics routine, you can be sure it's worth a watch. Nadia Comaneci took to Twitter on Sunday to retweet a video of a girl performing jaw-dropping stunts at what appears to be a gymnastic training centre.

చిన్నారి జిమ్నాస్టిక్స్ టాలెంట్ కు నెటిజనులు ఫిదా..!

Posted: 08/16/2021 05:45 PM IST
Viral video this girl s gymnastics routine impressed nadia comaneci virender sehwag

మనిషై పుట్టినవాడు కాదు మట్టి బొమ్మ.. పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ.. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు.. తరతరాలకీ తరగని వెలుగవుతారు.. ఇలవేల్పులు అవుతారు.. అన్న వేటూరు సుందరరామమూర్తి పాటను వంటబట్టించుకుందోమో తెలియదు గాని.. పట్టుమని ఐదేళ్లు కూడా లేని ఓ చిన్నారి.. తన  టాలెంట్, ప్రాక్టీస్ తో అసాధ్యమైన జిమ్నాస్టిక్స్ ను సుసాధ్యం చేసిచూపుతోంది. ఈ చిన్నారి వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది. పలు రంగాలకు చెందిన ప్రముఖల నుంచి సాధారణమైన నెటి జనుల వరకు అందరూ చిన్నారి జిమ్నాస్టిక్‌కు ఫిదా అవుతున్నారంటతే.

సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా త‌న గురించే చ‌ర్చ‌. త‌న వీడియో సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇంత‌కీ ఆ వీడియోలో ఏముంది అంటారా? త‌ను చేసిన జిమ్నాస్టిక్‌ వీడియో అది. త‌న జిమ్నాస్టిక్ వ‌ర్క‌వుట్ చూసి మీరే నోరెళ్ల‌బెబ‌తారు. ప్రపంచవ్యాప్తంగా సినీ, క్రీడా సెలబ్రిటీలు సైతం ఈ వీడియోను షేర్ చేసి చిన్నారిని ప్రశంసిస్తున్నారు. రిటైర్డ్ ఇండియన్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ట్విట్టర్ లో ఆ చిన్నారి వీడియోను షేర్ చేయగా.. ఒక్క ట్విట్టర్ లోనే ఇప్ప‌టి వ‌ర‌కు 4.7 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. ఇంత చిన్న వయసులో చిన్నారి ఫిట్నెస్, టాలెంట్ చూసిన నెటిజన్లకు మతిపోతుంది. కొందరైతే ఇది జిమ్నాస్టిక్స్ కాదురా బాబోయ్ ఇది విధ్వంసాన్ని మించిన అరాచకం అంటూ సెల్యూట్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles