Lucknow cab driver threatens suicide if girl not arrested క్యాబ్ డ్రైవర్ పై దాడి కేసు: పోలీసులకు ట్విస్ట్ ఇచ్చిన యువతి

Should a girl not defend herself asks woman who thrashed cab driver in lucknow

priyadarshini, Saadat Ali, gril assaults cab driver, girl assaults mediator, girl assaults cab driver on road, uttar pradesh girl assaults cab driver, cab driver assaulted awadh cross road, lucknow, Awadh crossroads, #ArrestLucknowGirl, lucknowgirl, viral, social media, twitter, Uttar Pradesh news, viral video

A viral video, showing a woman thrashing a cab driver at a traffic signal in Lucknow, has sparked outrage on social media platforms, with netizens trending hashtags like #ArrestLucknowGirl. India Today TV spoke to the woman, Priyadarshini, who claimed she was only defending herself.

క్యాబ్ డ్రైవర్ పై దాడి కేసు: పోలీసులకు ట్విస్ట్ ఇచ్చిన యువతి

Posted: 08/06/2021 01:37 PM IST
Should a girl not defend herself asks woman who thrashed cab driver in lucknow

ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలోని అవధ్ క్రాస్ రోడ్స్ వద్దనున్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక యువతి అకారణంగా క్యాబ్ డ్రైవర్ ను కొట్టిన ఘటనపై ఎట్టకేలకు లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు. తనను అకారణంగా కోట్టిన యువతిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన క్యాబ్ డ్రైవర్ సాదత్ అలి లేనిపక్షంలో తాను ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు. తాను ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించలేదని, అయినప్పటికీ పోలీసులు తనపై కేసు పెట్టారని సాదత్ అలి వాపోయాడు. పోలీసులు ఒక రోజంతా తనకు ఆహారం కూడా పెట్టలేదని, ఆ యువతి చెప్పిందే విన్నారు తప్పితే పేదవాడినైన తన మాటలు ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రియదర్శిని అనే మహిళను తాను సివిల్ డ్రెస్ లో వున్న పోలీసు అని భావించానని, అందుకనే అమె తనపై దాడి చేస్తున్నా.. మిన్నకుండిపోయానని చెప్పారు. ఆమె తన ఫోన్ ను పగలగొట్టిందని, కారు సైడ్ అద్దాలను బద్దలగొట్టడమే కాకుండా, తన జేబులో ఉన్న రూ. 600 కూడా లాక్కుందని ఆరోపించాడు. కాగా యువతి వాదన మరోలా వుంది. తాను రోడ్డు దాటుతున్న సమయంలో కారుతో అతడు అతిసమీపంగా వచ్చాడని, దాదాపు ఢీకొట్టేంత పని చేశాడని ఆరోపిస్తూ అతడిని క్యాబ్ నుంచి కిందికి లాగి ఎడాపెడా చెంపలు వాయించింది. అయితే సీసీటీవీ ఫూటేజీని పరిశీలించిన పోలీసులకు యువతి ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నట్లు కనిపించడంతో అమెదే తప్పని నిర్థారణకు వచ్చారు.

దీంతో యువతి అందరికీ దిమ్మతిరిగే ట్విస్ట్‌ ఇచ్చింది. పోలీసులు తన కుటుంబ సభ్యులను వేధించారని ఆరోపించింది. పోలీసుల దగ్గర తన కుటుంబసభ్యుల ఫోన్ నంబర్లు, వివరాలు ఉన్నాయంది. తనపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవి అడ్డంగా వాదించింది. క్యాబ్ డ్రైవర్ ని ఊరికే కొట్టలేదని, ఆత్మరక్షణ కోసం మాత్రమే చేయి చేసుకున్నా అని తప్పును సమర్థించుకుంది. అంతేకాదు ఏడాది కాలంగా తను వేధింపులకు గురవుతున్నానని, ఈ క్రమంలో తాను పోలీసులను కూడా ఆశ్రయించానని చెప్పింది. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అరోపించింది. మరి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

అసలేం జరిగిందంటే..

జులై 30వ తేదీ  రాత్రి 9 గంటల 41 నిమిషాల సమయంలో లక్నోలోని కేసరి ఖేడా ట్రాఫిక్ క్రాసింగ్ వద్ద జరిగినట్లు సీసీటీవీ ఫుటేజి ద్వారా తెలుస్తోంది. ఈ సంఘటనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మహిళ రోడ్డు దాటుతుండగా క్యాబ్ డ్రైవర్  ఆమె ముందు ఆపాడు. దీంతో మహిళ డ్రైవర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ డ్రైవర్ ను కొట్టింది. గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు ఆ మహిళ రోడ్డు దాటిందని సిసిటీవీ ఫూటేజీలో స్పష్టంగా నిక్షిప్తమై వుంది. వాస్తవానికి అక్కడ ఉన్న సిగ్నల్ ఫ్రీ లెఫ్ట్ చూపిస్తున్నా.. వాహనాలు వేగంగా వెళ్తుండగా మహిళ రోడ్డు దాటటానికి ప్రయత్నించినట్లు వీడియోలో ఉంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles