Six months imprisonment to MLA Danam Nagender దానం నాగేందర్ కు ఆరు నెలల జైలు శిక్ష: నాంపల్లి కోర్టు తీర్పు

Trs khairathabad mla danam nagender gets six month jail term

TRS MLA found guilty of assaulting a person, Nampally Court, Danam Nagender, Khairathabad MLA, Six Months Imprisonment, Assaulting Police man, Rs 1000 Fine, Banjara hills, Hyderabad, Telangana, Crime

Nampally Court has announced six months imprisonment to TRS MLA Danam Nagender for assaulting a constable and injuring him during Telangana agitation. A case was registered in Banjara Hills in 2015. After the case was proved accusing TRS MLA

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఆరు నెలల జైలు శిక్ష

Posted: 07/07/2021 07:15 PM IST
Trs khairathabad mla danam nagender gets six month jail term

మాజీ మంత్రి, ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటిన్ క్రిమినల్ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు ఆరు నెలల పాటు జైలు శిక్షను విధించింది. అంతేకాదు ఆయన జరిమానాను కూడా విధించింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెతున్న సాగుతున్న నేపథ్యంలో ఆయన కారుకు అడ్డుగా వెళ్లిన ఓ వ్యక్తిని కర్రతో కొట్టి దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

2013లో బంజారాహిల్స్ లో నమోదైన కేసులో దానం నాగేందర్ దోషిగా తేల్చి శిక్షను ఖరారు చేసింది. తన కారుకు అడ్డుగా వెళ్లిన వ్యక్తిపై ఆయన దాడి చేసి గాయపరిచారన్న కేసులో అభియోగాలు రుజువయ్యాయి. కాగా న్యాయస్థానం తమ తీర్పుపై దానం నాగేందర్ పై కోర్టులకు వెళ్లేందుకు.. అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్షను నెల రోజులపాటు నిలిపివేసింది. దానం నాగేందర్ పై కోర్టు ఇచ్చిన తీర్పుపై రాజకీయంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles