CPI Narayana critisizes Telugu state governments రంజుగా కృష్ణా జలాల జగడం: సిపిఐ నారాయణ

Cpi narayana critisizes telugu state governments over krishna water dispute

K.Narayana, CPI National Secretary, River Krishna, Krishna water dispute, Union Government, Krishna River management board, Tribunal, Water resources ministry, CM YS Jagan, CM K Chandrashekar Rao, Telangana, Andhra Pradesh

CPI national secretary K Narayana critisizes Telangana and Andhra Pradesh state governments over Krishna water dispute says the drama by the two states draws public attention only to divert people from local issues.

రంజుగా తెలుగురాష్ట్రాల మధ్య కృష్ణా జలాల జగడం: సిపిఐ నారాయణ

Posted: 07/05/2021 12:01 PM IST
Cpi narayana critisizes telugu state governments over krishna water dispute

గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాల జగడం నాటకరం రంజుగా సాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నెలకోన్న సమస్యలపై ఉంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ డ్రామా కోనసాగుతోందని ఆయన విమర్శించారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఏ సమస్య వచ్చినా దానిని కృష్ణా జలాలతో ముడిపెడుతున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడేళ్లు కావస్తున్నా ఇంకా రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం కోనసాగడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

ఈ సమస్య ఉత్పన్నం కావడానికి కేంద్ర ప్రభుత్వమే ఒక కారణంగా పేర్కోన్న ఆయన.. కేంద్రమే ఈ సమస్యను పరిష్కరించాలని, తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌ ఎవరికి వారే ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం సమస్య పరిష్కారం కనుగొనడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో, ప్రస్తుత జగన్ ప్రభుత్వంతోనూ తెలంగాణ ప్రభుత్వం సమస్యను పరిష్కరించుకోలేకపోయిందని దుయ్యబట్టారు.

కృష్ణా జలాల వినియోగంపై ఇటీవల జారీ చేసిన ఆదేశాలపై ట్రైబ్యునల్ ను కేసీఆర్ ప్రశ్నిస్తే.. జగన్‌మోహన్‌ రెడ్డి కోర్టులు, ఎన్నికల కమిషన్లను ప్రశ్నించే స్థాయికి చేరుకున్నారని విమర్శించారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల వద్ద పోలీసుల మోహరింపును చూస్తుంటే భారత్ - చైనా దేశాల సరిహద్దులు గుర్తొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు ఇరు రాష్ట్రాలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కృష్టా జలాల వివాదాన్ని జటిలం చేసుకోవడం కన్నా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవడమే మార్గమని నారాయణ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles