‘Any Alternative Front Only with Congress’: Pawar ‘‘బీజేపిని ఢీకొనాలంటే కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ అవసరం’’

No coalition without congress to take on bjp sharad pawar

Sharad Pawar, Nationalist Congress Party (NCP), poll strategist, Prashant Kishor, Congress Party, coalition government

Nationalist Congress Party chief Sharad Pawar said the Congress cannot be left out of any alternative front to take on the BJP, days after a meeting at his residence gave rise to speculation about Third Front moves for the 2024 elections.

బీజేపిని ఢీకొనాలంటే కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ అవసరం: శరద్ పవార్

Posted: 06/26/2021 01:15 PM IST
No coalition without congress to take on bjp sharad pawar

దేశంలో బీజేపి నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోనేందుకు తాము ఏ ఫ్రంట్ తోనైనా జతకట్టేందుకు సిద్దంగా వున్నామని. అయితే ఆ ఫ్రంట్ లో కాంగ్రెస్ పార్టీకి కూడా చోటు వుండాలని శరద్ పవార్ అన్నారు. కాంగ్రెస్ లేకుండా ఏ ఫ్రంట్ ఏర్పాటు చేసినా.. బీజేపిని ఎదుర్కోవడం అనితర సాథ్యమని అన్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో వరుస భేటీలు నిర్వహిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దేశ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రశాంత్ కిశోర్ తో పవార్ భేటీలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.

అయితే ఈ సమావేశాలు తృతీయ ఫ్రంట్ నేపథ్యంలో సాగడం లేదని యశ్వంత్ సిన్హా ట్వీట్ చేసినా.. అసలేం జరుగుతుందన్న ఉత్కంఠకు శరద్ పవార్ తెరదించారు. ఈ క్రమంలో పవార్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దేశంలో బీజేపీని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ చేయూత ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఏ ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేసినా, కాంగ్రెస్ ను విస్మరించలేమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లేని ఫ్రంట్ లతో ఉపయోగంలేదని పరోక్షంగా తేల్చి చెప్పారు. థర్డ్ ప్రంట్ ఏర్పాటుపై జరుగుతున్న ప్రచారం పట్ల స్పందిస్తూ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇప్పటివరకు కూటమి గురించి తమ సమావేశాల్లో చర్చకు రాలేదని, ఒకవేళ ఏదైనా ప్రత్యామ్నాయ శక్తి ఏర్పడితే అందులోకి కాంగ్రెస్ ను తీసుకోవడం తథ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ వంటి బలీయమైన శక్తి రాజకీయాల్లో అవసరమని పవార్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఏ ఫ్రంట్ రూపుదిద్దుకున్నా సమష్టి నాయకత్వం ఉండాలని అన్నారు. ఒకవేళ మీరు ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు ఆయన జవాబిస్తూ... "శరద్ పవార్ గతంలో ఇలాంటివి చాలాసార్లు ప్రయత్నించి చూశారు" అంటూ చమత్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles