UP minister Vijay Kashyap succumbs to Covid-19 కోవిడ్ బారిన పడి ఉత్తర్ ప్రదేశ్ మంత్రి విజయ్ కశ్యప్ మృతి

Uttarpradesh minister vijay kashyap succumbs to coronavirus

UP minister, Vijay Kashyap, Kamal Rani Varun, Chetan Chauhan, Covid-19, coronavirus, Gurgaon hospital, Medanta Hospital, Charthawal Assembly, Muzaffarnagar, Uttar Pradesh

Uttar Pradesh Minister of State for Revenue and Flood Control Vijay Kashyap died from coronavirus at a Gurgaon hospital. Kashyap (56), who was an MLA from Muzaffarnagar’s Charthawal Assembly seat, died at Gurgaon’s Medanta Hospital. He is the third U.P. minister who has succumbed to the virus. Last year, Uttar Pradesh ministers Kamal Rani Varun and Chetan Chauhan had died from the infection.

కోవిడ్ బారిన పడి ఉత్తర్ ప్రదేశ్ మంత్రి విజయ్ కశ్యప్ మృతి

Posted: 05/19/2021 10:44 AM IST
Uttarpradesh minister vijay kashyap succumbs to coronavirus

కరోనా వైరస్ రెండో దశ ఉద్దృతి దేశంలో మరింత తీవ్రంగా కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో ప్రజా ప్రతినిధులే కాదు.. పలు రాష్ట్రాల అమాత్యులు కూడా వున్నారు. కరోనా మహమ్మారి బారిన పడి తాజాగా ఉత్తరప్రదేశ్ రెవెన్యూ, వరద నియంత్రణ మంత్రి విజయ్ కశ్యప్ మృతి చెందారు. 56 ఏళ్ల మంత్రి ముజఫర్‌నగర్‌లోని చార్తవాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహమ్మారి బారినపడి గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు.

విజయ్ కశ్యప్‌తో కలిపి యూపీలో ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులు కరోనాతో మృతి చెందారు. గతేడాది కోవిడ్ బారిన పడి మంత్రులు కమల్ రాణి వరుణ్, చేతన్ చౌహాన్ అసువులు బాసారు. విజయ్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సంతాపం తెలిపారు. నిత్యం ప్రజల అవసరాలను ఎరిగి వారి ప్రయోజనార్థం పనులు చేయాలని కాంక్షించే నేత కానరాని లోకాలకు తరలివెళ్లారని ప్రధాని తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అండగా నిలిచి పార్టీ పటిష్టత కోసం అనుక్షణం పనిచేశారని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ సంతాపం తెలిపారు. కాగా, కరోనా సెకండ్ వేవ్ ప్రభావానికి మరణించిన బీజేపీ ఎమ్మెల్యేలలో విజయ్ కశ్యప్ ఐదోవారు. అంతకుముందు సలోన్ శాసనసభ్యుడు దాల్ బహదూర్ కోరి, నవాబ్‌‌గంజ్ శాసనసభ్యుడు కేసర్ సింగ్ గంగ్వార్, ఔరైయా ఎమ్మెల్యే రమేశ్ దివాకర్, లక్నో వెస్ట్ ఎమ్మెల్యే సురేశ్ కుమార్ శ్రీవాస్తవ కరోనాకు బలయ్యారు. శ్రీవాస్తవ భార్య కూడా కరోనా కారణంగా మృతి చెందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles