Former AIADMK MLA convicted in assets case అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేకు నాలుగేళ్ల జైలు శిక్ష..

Former aiadmk mla paramasivam convicted in assets case

R.P. Paramasivam convicted in disappropriate assets case, ex-mla paramasivam wife Poonkodi, former AIADMK MLA convicted, Chinna Salem Ex MLA sentenced, four years imprisonment to parmasivam, paramsivam disproportionate assets case, district judge, K.H. Elavazhagan, R.P. Paramasivam, Poonkodi, former AIADMK MLA, Chinna Salem, four years imprisonment, disproportionate assets, Tamil Nadu, Crime

The Villupuram principal district and sessions court convicted R.P. Paramasivam, former AIADMK MLA from Chinna Salem, to four years imprisonment in a disproportionate assets case. The principal district judge, K.H. Elavazhagan, also slapped a fine of ₹33.04 lakh on Mr. Paramasivam.

అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేకు నాలుగేళ్ల జైలు శిక్ష.. భారీ జరిమానా

Posted: 03/30/2021 02:57 PM IST
Former aiadmk mla paramasivam convicted in assets case

తమిళనాడులో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అధికార అన్నాడీఎంకే పార్టీకి షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందని చిన్నమ్మ శశికళ.. అక్రమాస్థుల కేసులో బెంగుళూరులోని పరప్పనా అగ్రహారం జైలులో నాలుగేళ్ల కారాగారవాసాన్ని అనుభవించి.. ఇటీవలే విడుదలై వచ్చిన విషయం తెలిసిందే. రావడంతోనే పార్టీపై అధిపత్యం చెలాయిస్తునందని భావించగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగుతున్న సమయంలో అదే అన్నాడీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.పి. పరమశివమ్ కు విల్లుపురం కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది.

ఆక్రమంగా ఆస్తులను కూడబెట్టిన కేసులో దోషిగా తేలిన పరమశివానికి నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 33 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. పరమశివం 1991లో విల్లుపురం జిల్లా చిన్నసేలం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అక్రమాస్తుల కేసులో దివంగత జయలలిత, శశికళ తదితరులపై దాఖలైన కేసుల్లో పరమశివం కూడా ఉన్నారు. 1991-96 మధ్య ఆయన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు 1998లో ఏసీబీ కేసు నమోదు చేసింది. తొలుత ఈ కేసును విల్లుపురం కోర్టులో విచారించగా, ఆ తర్వాత చెన్నైలోని ప్రజాప్రతినిధుల కేసుల ప్రత్యేక కోర్టుకు మారింది.

అక్కడ కొన్నాళ్లపాటు విచారణ జరిగిన తర్వాత మళ్లీ విల్లుపురం జిల్లా కోర్టుకు కేసును బదిలీ చేశారు. తాజాగా జరిగిన విచారణలో పరమశివం ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు నిర్ధారణ అయింది. దీంతో నిన్న ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఆయన సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 33 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles