Bigg Boss Harika Removed from Telangana Tourism Website దేతడి హారికకు షాక్ ఇచ్చిన పర్యాటక శాఖ

Appointment of harika as tourism brand ambassador turns controversial

Bigg boss Harika, Harika appointed as brand ambassador, Alekhya Harika, Telangana State Tourism Corporation development, brand ambassador, contraversy, Alekhya Harika, Brand Ambassador, Bigg Boss Harika, Telangana Tourism Website, V.Srinivas Goud, Srinivas Gupta, Telangana

The appointment of Bigg Boss fame Harika as Telangana brand ambassador has turned controversial.

ఆఘమేఘాల మీద హారిక పేరును తొలగించిన పర్యాటక శాఖ

Posted: 03/09/2021 05:21 PM IST
Appointment of harika as tourism brand ambassador turns controversial

తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైన దేత్తడి హారికకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌ హారికను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడమే కాక ఆమెకు అపాయిట్‌మెంట్ ఆర్డర్ సైతం  అందజేశారు. అయితే దీనిపై వివాదం రాజుకుంది. మంత్రికి, ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై టూరిజం శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

ఈ వ్యవహారం చీఫ్ సెక్రటరీ వరకు వెళ్లింది. దీంతో వెంటనే అలర్టెయిన అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో హారికకు నియామకానికి సంబంధించిన వివరాలను తొలగించారు. అయితే తెలంగాణ టూరిజం అధికారిక ట్విట్టర్‌లో మాత్రం ఆమె నియామకానికి సంబంధించిన వివరాలు అలాగే ఉన్నాయి. హారికకు ముందు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా నియమించిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో తాజాగా హారికను నియమించగా.. ప్రస్తుతం ఆమె పేరును వెబ్‌సైట్ నుంచి తొలగించడం కలకలం రేపుతుంది.

ఇక హారిక నియామకంపై ఓ రేంజ్‌లో విమర్శలు వచ్చాయి. అసలు ఏ అర్హత ఆధారంగా ఆమెని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించారంటూ నెటిజనులు విమర్శించారు. హారికకు ఏ అర్హతలు వున్నాయని అమెను తెలంగాణ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారంటూ అమె నియామకంపై ప్రశ్నలవర్షం కురుస్తోంది. యూట్యూబ్ స్టార్‌గా సత్తా చాటడం, బిగ్ బాస్‌లో పాల్గొనడమే అర్హతలా అని ప్రశ్నించారు. ఎవరెస్ట్ సహా ప్రపంచంలోని ఆరు ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన మాలావత్ పూర్ణ, మిస్ ఇండియాగా ఎంపికై వారణాసి మానస తదితరులను ఎంపిక చేయవచ్చు కదా అంటూ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles