state bank of india hikes bank locker charges ఎస్బీఐ ఆ సౌకర్యం వినియోగదారులకు వాయింపే.!

State bank of india hikes bank locker charges from march 31

sbi locker charges, SBI Locker rental charges, state bank of india, locker charges, Safe Deposit Locker, SBI, bank locker, Charges, Penalities

The State Bank of India (SBI) has announced a hike in its safe deposit rental charges with effect from March 31, 2020. According to an announcement on the bank's website, rental charges have been increased by Rs 500-3,000 depending the on the size of the locker and the city the account holder has the locker in.

ఎస్బీఐ ఆ సౌకర్యం వినియోగదారులకు వాయింపే.!

Posted: 02/25/2020 03:05 PM IST
State bank of india hikes bank locker charges from march 31

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ గా అవతరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. మరోమారు తన ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. కొనాళ్ల క్రితం సేవింగ్స్ ఖాతాదారులను మినిమమ్ డిఫాజిట్ల నిల్వలు లేని పక్షంలో పెనాల్టీలపై పెనాల్టీలు వేస్తూ వారిని బెంబేలెత్తించిన ఎస్బీఐ.. తాజాగా బ్యాంకుల్లో సేఫ్ డిపాజిట్ లాకర్ల చార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్బీఐ బ్యాంక్‌ లాకర్లో బంగారం ఆభరణాలు సహా ఇతర విలువైన వస్తువులను దాచుకోవాలని భావించే వారికి చుక్కలు కనిపించనున్నాయి.

బ్యాంక్ లాకర్ రెంటర్ చార్జీల పెంపుతో అనేకమంది ఖాతాదారులకు దీని ప్రభావం నేరుగానే పడనుంది. స్టేట్ బ్యాంక్ తన లాకర్ వార్షిక చార్జీలను ఒకేసారి ఏకంగా రూ.500 నుంచి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ స్మాల్ లాకర్ రెంటల్ చార్జీలు రూ.500 పెరుగుదలతో రూ.2,000కు చేరనున్నాయి. అదే సమయంలో ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్ అద్దె చార్జీలు కస్టమర్లకు భారీగానే భారం పడనుంది. ఈ చార్జీలను ఏకంగా రూ.3,000 పెంచింది ఎస్బీఐ. ప్రస్తుతం రూ.9000 గా వున్న చార్జీలు.. మార్చి 1 నుంచి రూ.12 వేలకు చేరుకోనున్నాయి.

ఎష్బీఐ మీడియం సైజు లాకర్ చార్జీలు కూడా భారీగానే పెంచేసింది ఎస్బీఐ. మూడు వేల రూపాయలుగా వున్న వీటి అద్దెను రూ.1000 పెంచుతూ రూ.4,000కు చేరుకుంది. లార్జ్ లాకర్ అద్దె చార్జీ కూడా రూ.2,000 పెరుగుదలతో రూ.8,000కు పెరిగింది. మెట్రో నగరాల్లో, పట్టణ ప్రాంతాల్లోని బ్యాంక్ బ్రాంచుల్లో ఉన్న లాకర్లకు మాత్రమే ఈ రేట్లు వర్తిస్తాయని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. పెరిగిన ధరలకు అదనంగా జీఎస్టీని కూడా చెల్లించాల్సి వస్తుందని తెలిపింది.

సబ్ అర్భన్, పట్టణ, గ్రామీణ ప్రాంత బ్రాంచుల్లో కూడా లాకర్ చార్జీలను పెంచిన ఎస్బీఐ.. ప్రస్తుతం వున్న చార్జీలకు తక్కువగానే పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాల్లోని బ్యాంక్ బ్రాంచుల్లో లాకర్ చార్జీలు రూ.1,500 నుంచి ప్రారంభమై..గరిష్టంగా రూ.9,000 వరకు ఉన్నాయి. లాకర్ సైజ్ ప్రాతిపదికన చార్జీలు మారతాయి. మొత్తంగా చూస్తే.. ఎస్బీఐ లాకర్ రెంటల్ చార్జీలు 33 శాతం మేర అదనపు వాయింపు దేశవ్యాప్తంగా అన్నిశాఖలకు వర్తించనుంది. అంతేకాదు లాకర్ రెంటల్ చార్జీలతో పాటు ఈ ఖాతాదారులు ఇతర చార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

* వన్ టైమ్ లాకర్ రిజిస్ట్రేషన్ చార్జీ కింద స్మాల్, మీడియం సైజ్ లాకర్లకు రూ.500, లార్జ్, ఎక్స్ ట్రా లార్జ్ లాకర్లు రూ.1000 చెల్లించాలి. జీఎస్‌టీ అదనం.
* ప్రతీ ఏడాది బ్యాంకు లాకర్ సైజును బట్టి అద్దెను చెల్లించాలి. అలస్యమైతే ఏకంగా 40 శాతం పెనాల్టీ పడుతుంది.
* ఎస్బీఐ లాకర్ కొత్త చార్జీలు మార్చి 31 నుంచి అమల్లోకి వస్తుంది. ఈలోపు బ్యాంక్ లాకర్‌ తీసుకుంటే ప్రస్తుత చార్జీలే వర్తిస్తాయి.
* ఏడాది తర్వాత మాత్రం మళ్లీ పెరిగిన చార్జీలు చెల్లించుకోవలసి ఉంటుంది.
* కాగా ఆర్బీఐ అదేశాల ప్రకారం.. ఏడాదిలో ఒకసారైన బ్యాంక్ లాకర్‌ తెరవకపోతే.. బ్యాంక్ అధికారులు నోటిసులు పంపుతారు.
* అప్పటికీ స్పందించని పక్షంలో అలాంటి లాకర్లను తెరిచే అవకాశముంది. అయితే దీని కన్నా ముందు బ్యాంక్ మీ నోటీసు పంపుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles