IndiGo announces four-day special Valentine sale ‘‘వాలెంటైన్స్ డే’’ స్సెషల్: ఇండిగో బంపర్ ఆఫర్

Indigo valentine sale now book flight tickets at just rs 999

Indigo Air Lines, Special Discoun, Domestic Passengers, Indigo Valentine sale, Indigo sale, Indigo bumper offer, indigo 999 sale, Indigo website, Indigo Passengers, India

Low cost carrier IndiGo announced a four-day special Valentine sale on travel across its network within India with all-inclusive fares starting at Rs 999. The airline is offering one million seats on discounted fares from February 11 to February 14.

‘‘వాలెంటైన్స్ డే’’ స్సెషల్: ఇండిగో బంపర్ ఆఫర్

Posted: 02/13/2020 10:59 AM IST
Indigo valentine sale now book flight tickets at just rs 999

ప్రేమికుల రోజు (వాలెంటైన్స్ డే)ను పురస్కరించుకుని ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆపర్ లో భాగంగా దేశీయంగా విమానయానం చేసే వారికి స్పెషల్ డిస్కౌంట్ ఫ్రకటించింది. దేశంలోని పలు ప్రాంతాలకు ప్రయాణించడానికి ప్రత్యేక తగ్గింపు ఆఫర్ కింద కేవలం రూ.999కే టికెట్ ను అందిస్తొంది. ఫ్రిబవరి 14వ తేదీ అర్థరాత్రి వాలెంటైన్స్ డే ఆఫర్ ముగుస్తోందని సంస్థ వర్గాలు తెలిపాయి. ఈలోగా ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది.

కాగా ఈ ఆఫర్ కింద తమ సంస్థ మొత్తం పది లక్షల సీట్లను కేటాయించిందని తెలిపింది. ఈ ఆఫర్ టికెట్లను బుక్ చేసుకున్నవారు మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ప్రయాణించాల్సి ఉంటుందని ఇండిగో సంస్థ వెల్లడించింది. ఇక దీనికి తోడు ప్రయాణికులు తమ సీట్లు, బోజనాలు బుక్ చేసుకుంటే వాటిపై పదిశాతం డిస్కౌంట్ కూడా లభించనుంది. ఇక ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు తమ డెబిట్ కార్డుతో బుక్ చేస్తే మరో పది శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తోందని పేర్కోన్నారు. దీనికి తోడు ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతాదారుల ఈ టికెట్లను డిస్కౌంట్ పై బుక్ చేసుకునే సౌలభ్యంతో పాటు అలా బుక్ చేసుకునే వారికి 12 శాతం క్యాష్ బ్యాక్ కూడా లభిస్తోందని సంస్థ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles