Pawan Kalyan condemns abolishing of Council మండలి రద్దు సవ్యమైన చర్య కాదు: పవన్ కల్యాణ్

Pawan kalyan condemns abolishing of council in open letter

Janasena, BJP, Pawan kalyan, Vijayawada, abolishment of Legislative council, abolish, Legislative council, Open letter, council abolishment, Amaravati, Visakhapatnam, wrong propaganda, defamation suit, social media, false articles, farmers, Capital city, Amaravati, agitation, Nadella Manohar, Sunil Deodhara. GVL Narasimha Rao, Amaravati, Visakhapatnam, AP CM Jagan, YSRCP party, Andhra Pradesh, Politics

Jana Sena chief Pawan Kalyan Condemned the decision of YS Jagan-led government decision to abolish the Legislative Council. It is mentioned in the statement, that it is not an appropriate decision to abolish the Legislative Council which provides an opportunity to utilise intellectual ideas to develop the state.

ITEMVIDEOS: మండలి రద్దు సవ్యమైన చర్య కాదు: పవన్ కల్యాణ్

Posted: 01/28/2020 03:03 PM IST
Pawan kalyan condemns abolishing of council in open letter

ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలిని రద్దు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో ఈ బిల్లుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. శాసనమండలి రద్దు నిర్ణయం సవ్యమైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వీర్గీయ నందమూరి తారక రామారావు రద్దు చేసిన శాసన మండలిని పునరుద్దరించేందుకు మాజీ సీఎం చెన్నారెడ్డి 1990లో కృష్టి చేసినా అది సాధపడలేదని.. అయితే దానిని 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషి ఫలితంగా పునరుద్దీపబడిందని అన్నారు.

అప్పట్లో కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వుండటంతో.. అటు లోక్ సభతో పాటు ఇటు రాజ్యసభలోనూ తన మిత్రపక్షాలతో కలసి బిల్లును అమోదింపజేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. దానిని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అందించిందని అన్నారు. అయితే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పునరుద్ధరించిన మండలిని రద్దు చేయడం సహేతుకరమైన చర్య కాదని అన్నారు. రాజ్యాంగ రూపకర్తలు ముందుచూపుతోనే రెండు సభలు ఏర్పాటు చేశారని అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఇలాంటి వ్యవస్థలను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. శాసనసభ బిల్లులను ఏ ప్రభావంతో అమోదించినా.. శాసనమండలిలోని సభ్యులు ప్రతీ బిల్లుపై లోతుగా అధ్యయనాలు చేస్తారని.. మేధావులు, రాజకీయ పండితులు, వివిధ రంగాలలో నిష్ణాతులు ఈ సభకు ప్రాతినిథ్యం వహిస్తారని.. వారు బిల్లులను అమోదించే క్రమంలో అన్ని రకాలుగా అలోచించి పలు సవరణలు కూడా చేసేలా చర్యలు తీసుకుంటారని పవన్ అన్నారు. రద్దుకు ప్రజాభిప్రాయం తీసుకున్నట్టు లేదని పవన్ కల్యాణ్ అన్నారు.

ఇక ఇటు ట్విట్టర్ ద్వారా కూడా ఇవాళ సీఎం జగన్ పై విమర్శలు కురిపించారు. 'న్యాయస్థానాన్ని కూడా రద్దు చేస్తావా జగన్ రెడ్డి?' అని ప్రశ్నించారు. ఎనిమిది నెలల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ ఆయన తీరు సరికాదని హితవు పలికింది. 'హడావుడిగా రాజధాని తరలింపు చేయడం తప్పు అని కోర్టు తెలిపింది. తెలుగు మాధ్యమం లేకుండా చేయడం సరికాదని చెప్పింది. ఉద్యమంలా చేపట్టిన ప్రభుత్వ కార్యాలయాలకి రంగులేసుకునే కార్యక్రమాన్ని తప్పుబట్టింది. నియంత ధోరణిలో నువ్వు తీసుకుంటోన్న నిర్ణయాలను తప్పుబడుతోందని న్యాయస్థానాన్ని కూడా రద్దు చేస్తావా జగన్ రెడ్డి?' అంటూ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  BJP  abolish  Legislative council  Open letter  AP CM Jagan  Andhra Pradesh  Politics  

Other Articles