Amaravati farmers stage bandh on 18th day అమరావతి బంద్: పోలీసులకు సహాయ నిరాకరణ

Amaravati bandh complete in capital region as protests continue

YS Jagan, Amaravati, Amaravati Bandh, !44 Section, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Intensifying the agitation, farmers of the capital city area enforced a bandh. The farmers and local youth went around offices and educational institutions in the area and made them down the shutters. Except for emergency services in hospitals, the bandh was complete observed as part of ‘Sakala Janula Samme’.

ITEMVIDEOS: అమరావతిలో కొనసాగుతున్న బంద్.. పోలీసులకు సహాయ నిరాకరణ

Posted: 01/04/2020 11:18 AM IST
Amaravati bandh complete in capital region as protests continue

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవరావతిలో బంద్ కొనసాగుతోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కోనసాగించాలని డిమాండ్ చేస్తూ మందడంలోని మార్కాపురం కూడలి వద్ద నిరసన తెలిపిన మహిళలు, రైతులపై పోలీసులు దౌర్జన్యం చేశారన్న వార్తలతో అప్రమత్తమైన అమరావతి గ్రామాల ప్రజలు పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. తాము సకల జనుల సమ్మెకు దిగి.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిన తొలిరోజునే పోలీసులు తమ ఉద్యమాన్ని అణిచివేయాలని చూశారని రైతులు అరోపించారు.

నిరసన కార్యక్రమాలకు దిగిన మహిళలను కూడా బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించడంపై మండిపడ్డ రైతులు అమరావతి బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు స్వచ్ఛంధంగా బంద్ పాటిస్తున్నారు. కాగా అత్యవసర సేవలను మినహాయించి అన్ని వ్యాపారాలను మూసివేశారు. గత పద్దెనిమిది రోజులుగా నిరసన కార్యక్రమాల్లో రైతులతో పాటు విద్యార్థులు, మహిళలు కూడా పాల్గొంటున్నారు. దుకాణాలను తెరిపించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

దీంతో పాటు తమ దుకాణాల ఎదుట పోలీసులు కూర్చునేందుకు కూడా ఆయా దుకాణాదారులు సమ్మతించడం లేదు. అంతేకాదు తమ శాంతియుత నిరసన కార్యక్రమాలకు సహకరించాలని కాళ్లు మొక్కినా పోలీసుల నుంచి సానుకూలత రాకపోవడంతో వారికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించరాదని కూడా స్తానిక ప్రజలు నిర్ణయించుకున్నారు. పోలీసులకు మంచి నీళ్ల బాటిళ్లను కూడా విక్రయించకూడదని కూడా అమరావతివాసులు తీర్మాణించుకున్నారు. పోలీసులు తమ గ్రామాల మీదుగా వెళ్లడానికి వీల్లేదని వెనక్కి పంపించారు. దీంతో పోలీసులకు రైతులకు వాగ్వాదం జరిగింది. బంద్ కారణంగా రైతులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles