"New Liquor Policy is Andhra Pradesh minting money" ‘‘కాసులు కురిపిస్తున్న కొత్త మద్యం పాలసీ..’’

New liquor policy is andhra pradesh minting money alleges tdp

RamaNaidu, liquor ban, J Tax, Mobile wine shops, prohibition of Liquor, liquor rates, Liquor brands, AP Assembly, YSRCP MLAs, Laughs in Assembly, Excise Commissions, Revenue source, Andhra Pradesh, Politics

TDP MLA Ramanaidu slams Andhra Pradesh government over hike on alcohol rates, he alleges that New Excise Policy which been bought into force by the YSRCP government is minting money for the ruling party cadre.

‘‘కాసులు కురిపిస్తున్న కొత్త మద్యం పాలసీ..’’

Posted: 12/16/2019 04:16 PM IST
New liquor policy is andhra pradesh minting money alleges tdp

అనంతరం ఇదే అంశంపై మట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్సైజ్ పాలసీ వైసీపీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోందని అన్నారు. మద్యం దుకాణాల అద్దెలు వైసీపీ నేతలకే వెళ్తున్నాయని ఆయన అరోపించారు. నెలకు ఎనమిది వేలు కూడా రాని భవనాలకు ఎనభై వేల అద్దెలు చెల్లించడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు, బెల్టు దుకాణాలను మూయించిన ప్రభుత్వం.. కొత్తగా వచ్చిన మోబైల్ షాపులను ఎందుకు నియంత్రించలేదని మండిపడ్డారు. మద్యం దుకాణాల నుంచి మద్యం అక్రమంగా బార్లలోకి వెళ్తోందని.. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని ఆయన అరోపించారు.

మద్యం నియంత్రణకై వైసీపీ రేట్లు పెంచడం సమంజసం కాదన్నారు. ధరలు పెరిగితే వినియోగం తగ్గుతుందని అన్నారు కానీ.. పేద ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. మద్యం ధరల పెంపుతో పేదలు మొత్తం సంపాదనను మద్యం దుకాణాల్లోనే వెచ్చిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ధరల పెంపు విషయంలో ఇచ్చిన వివరణను కూడా ఆయన తప్పబట్టారు. మద్యానికి అప్లై చేసిన ఫార్ములాను ఆర్టీసీకి కూడా లెంకకట్టిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.

ఆర్టీసీ చార్జీలు కూడా పెంచారు కదా.. అంటే ప్రయాణికులు తగ్గాలని మీ ప్రయత్నమా అంటూ రామానాయుడు ప్రభుత్వంపై చతుర్లు విసిరారు. వైన్‌ షాపులలో మద్యం బ్రాండ్ల విక్రయాలపై ‘జే’ టాక్స్ ప్రభావం అధికంగా వుందని, దాని వల్లే ధరలు పెరుగుతున్నాయని అన్నారు. జే టాక్స్ కట్టని బ్రాండ్లకు మద్యం దుకాణాల్లో కనిపించడం లేదని ఆయన అరోపించారు. ఇప్పటికైన ప్రభుత్వం మద్యం మోబైల్ షాపులను నియంత్రించాలని కోరిన ఆయన ఈ విషయంలో తాను ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles