AP, Telangana Postal Circle Recruitment 2019 పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. మరో 2 రోజులే గడువు..

Indian postal department notifies more than 3677 job vacancies in telugu states

andhra pradesh jobs, ap postal recruitment, telangana postal recruitment, jobs in Andhra Pradesh, jobs in Telangana, andhra pradesh, Telangana, Postal jobs, Recruitment, jobs after 10th, central government jobs, government jobs, AP Circle, Telangana Circle

Job notification of INdia Post, dated 15 October 2019 regarding the recruitment of Gramin Dak Sevak (GDS) ends in two more days. As per the notification, 2,707 vacancies have been announced under Andhra Pradesh Postal Circle and 970 posts for postal jobs are vacant in Telangana Postal Circle.

పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. మరో 2 రోజులే గడువు..

Posted: 11/12/2019 01:22 PM IST
Indian postal department notifies more than 3677 job vacancies in telugu states

తెలుగు రాష్ట్రాల్లో పోస్టల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తు గడువు నవంబరు 14తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నవంబరు 21 వరకు ఆన్ లైన్ దరఖాస్తుకు అవకాశం ఉంది. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోసుకోవచ్చు. పదో తరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మెరిట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.

ఓసీ/ వెనుకబడిన తరగతులు/ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసిన వారు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించాల్సినవారు ఆన్‌లైన్ లేదా సంబంధిత పోస్టాఫీసులో చెల్లించవచ్చు. కాగా ధరఖాస్తు చేసే అభ్యర్థుల వ‌యోపరిమితి: 15.10.2019 నాటికి 18-40 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

తెలుగు రాష్ట్రాలకు చెందిన మొత్తం 3677 పోస్టులలో ఆంధ్రప్రదేశ్ లోని 2707 పోస్టులు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 970 పోస్టు లకు సంబంధించి ధరఖాస్తులు కోరుతున్నారు. ఏపీలోని మొత్తం 2707 పోస్టులలో బ్రాంచ్ పోస్టు మాస్టర్, అసిప్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్, డాక్ సేవక్ ఖాళీలున్నాయి. ఇక అటు తెలంగాణలోని 970 పోస్టులలో కూడా ఇవే ఖాళీలు వున్నాయి. ఈ ఖాళీల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. అక్టోబరు 14న రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 22న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3677 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల ఉద్యోగాలకు గాను ఏపీ సర్కిల్‌లో 2707 పోస్టులు, తెలంగాణ సర్కిల్‌లో 970 పోస్టులు ఉన్నాయి. పదోతరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు.

ముఖ్యమైన తేదీలు..

* రిజిస్ట్రేష‌న్, ఫీజు చెల్లింపు తేదీ ప్రక్రియ ప్రారంభం: 15.10.2019
* రిజిస్ట్రేష‌న్, ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.11.2019
* ఆన్ లైన్ దర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.10.2019
* ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 21.11.2019.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles