Tirumala Srivaru on Hanumantha vahanam తిరుమల బ్రహ్మోత్సవాలు: హనుమంత వాహనంపై శ్రీవారు

Tirumala bramhostavam srivaru on hanumantha vahanam

tirumala,tirumala brahmotsavam, Hanumantha vahanam, garuda vahanam, chinna shesha vahanam, hamsa vahanam. tirumala tirupati devasthanams, tirumala srivari brahmotsavam 2019, srivari brahmotsavam 2019, tirumala srivari brahmotsavam, brahmotsavam, srivari brahmotsavam, tirumala brahmotsavam 2019

Tirumala Sri vari Brahmotsavam celebrations are being conduted on the fifth day, as a part of brahmotsavam srivaru paraded Hanumantha vahanam in the tirumada streets.

తిరుమల బ్రహ్మోత్సవాలు: హనుమంత వాహనంపై శ్రీవారి ఊరేగింపు

Posted: 10/05/2019 10:21 AM IST
Tirumala bramhostavam srivaru on hanumantha vahanam

అఖిలాండకోటి బ్రహ్మోడనాయకునిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల పాలిట కొంగుబంగారమైన.. అల శ్రీనివాసుడికి ఇల వైకుంఠమైన  తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రమందు అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల కన్నుల పండువగా సాగుతున్నాయి. ఐదవ రోజును పురస్కరించుకుని దేవదేవుని ఇవాళ ఉదయం హనుమంత వాహన సేవను నిర్వహించారు. శీ్రరామ అవతారంలో హనుమంత వాహనాన్ని అధిరోహించని మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగితూ మాడ వీధుల్లో స్వామి దర్శనం కోసం వేచివున్న అశేష భక్తజన కోటికి అభయప్రధానం చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భక్త జనసందోహం పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరకుంటున్నారు. దీంతో తిరుమల క్షేత్రం  గోవిందనామ స్మరణతో  మారుమోగుతోంది. హనుమంత వాహనంపై ఊరేగే మలయప్ప స్వామిని దర్శించుకుని రామనామస్మరణ చేసుకుంటే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం లభిస్తాయని పురాణ వచనం. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

హనుమంతుడు భగవత్‌ భక్తుల్లో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడిగా, వ్యాకరణ పండితుడిగా.. లంకా భీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు.. తిరుమలేశుని తన మూపున వహించి తిరువీధుల్లో దర్శనమిచ్చే ఘట్టం భక్తజన రంజితం. ఈ హనుమంత వాహనంపై దేవదేవుని దర్శనం చేసుకుంటే.. శ్రీవారు భక్తులను కటాక్షిస్తారని, సర్వరోగాలను బాపి.. ఆయురారోగ్యాలతో వర్థిల్లేట్టు చేస్తారని భక్తుల విశ్వాసం. ఇక చిరంజీవి హన్మంతుడు కూడా తన స్వామి నామస్మరణ చేసిన భక్తులను అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tirumala brahmotsavam  Hanumantha vahanam  garuda vahanam  tirumada streets  devotees  TTD  

Other Articles