Devotees Give Way To Ambulance During Procession నిలిచిన గణేష్ శోభాయాత్ర.. అంబులెన్స్ కు దారి..

Devotees give way to ambulance during ganesh visarjan procession in pune

Devotees Give Way to Ambulancem Ganesh Idol Immersion Processionm Ambulance enroute to hospital without delay, pune ganesh ambulance, maharashtra ambulance, ambulance, ganesh chaturthi, devotees, ganesh visarjan, ganesh procession, lakshmi road, pune, Maharashtra

The devotees are way more in number especially in the streets of Pune in Maharashtra. One such incident that caught everyone's attention was when devotees gave way to an ambulance during Ganesh idol immersion procession.

ITEMVIDEOS: నిలిచిన గణేష్ శోభాయాత్ర.. అంబులెన్స్ కు దారి..

Posted: 09/13/2019 01:14 PM IST
Devotees give way to ambulance during ganesh visarjan procession in pune

సాధారణంగా భారీ ఊరేగింపులు సాగుతున్నప్పుడు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తారు. ఆ మార్గం నుండి వచ్చే వాహనాలను కూడా దారిమళ్లిస్తారు. ఎలాంటి ట్రాఫిక్ జామ్ లకు అస్కారం లేకుండా మళ్లింపులు జరుగుతాయి. దానిని ముందుగానే మీడియా ద్వారా విసృత్తంగా ప్రచారం కూడా చేస్తారు. కానీ కొన్నిసార్లు మాత్రం అనుకోని ఘటనలు, ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అలాంటప్పుడు ప్రజలు వ్యహరించే తీరు ఎలా వుంటుంది అంటే.. అందుకు ఈ ఘటనే ఉదాహరణ,

సకాలంలో సదరు ఊరేగింపు నిర్వహకులు, లేదా పోలీసులు, లేదా ప్రజలు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే వచ్చే ఉపద్రవం మనకు తెలిసిందే. ఎందుకంటే వారు తీసుకునే నిర్ణయాలపైనే బాధితుల ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. తాజాగా అలాంటి ఆసక్తికర ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. పూణేలోని లక్ష్మీ రోడ్డులో నిన్న గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది.

అయితే ఎవరికో అనారోగ్యం తలెత్తడంతో అంబులెన్సు సదరు రోగిని ఎక్కించుకుని ఆసుపత్రికి బయలుదేరింది. లక్ష్మీరోడ్డుకు చేరుకునేసరికి భారీఎత్తున ఊరేగింపు సాగుతోంది. దీంతో అంబులెన్సు ముందుకు వెళ్లేందుకు దారి కనిపించలేదు. అయితే వెనుక అంబులెన్సును గమనించిన ప్రజలు మానవత్వంతో వ్యవహరించారు. వెంటనే అందరినీ తప్పుకోవాల్సిందిగా కోరుతూ దారిని కల్పించారు.

దీంతో అంబులెన్సు వెళ్లేందుకు రోడ్డు క్లియర్ అయింది. అంబులెన్సు వీరిని దాటి వెళ్లగానే శోభాయాత్ర యథావిధిగా ముందుకు సాగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఊరేగింపు సందర్భంగా పూణేవాసులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ambulance  ganesh chaturthi  devotees  ganesh visarjan  ganesh procession  lakshmi road  pune  Maharashtra  

Other Articles