Man fined for not wearing helmet 'while driving car' హెల్మెట్ లేకుండా కారు నడిపితే జరిమానా..!

Man fined for not wearing helmet while driving car

Traffic Rules, Motor Vehicles Amendment Act, M Selvakumar, traffic cops, Seat belt, Helmet, NRK Puram, dharapuram, Helmet while driving car, Motor Vehicles Act, SMS, Traffic police, kongu main road, dharapuram, Tirupur, Tamil Nadu, Crime news

The rural police have sent a notice to M Selvakumar (41), of NRK Puram near Kongu Main road, near Tirupur of Tamil Nadu, for not wearing helmet and asked him to pay a fine of Rs 100. However, the registration number mentioned in the notice is that of his car’s.

హెల్మెట్ లేకుండా కారు నడిపితే జరిమానా..!

Posted: 09/04/2019 02:34 PM IST
Man fined for not wearing helmet while driving car

ప్రభుత్వ సంస్థల మధ్య అనుసంధానం కొరవడి కొత్తగా రోడ్డు వేసిన వెంటనే దానిని తివ్వి.. ఆ తరువాత ఎన్నాళ్లకో కానీ పూడ్చని ఘటనలు చూస్తూనే వున్నాం. ఇలాంటి నేపథ్యంలో గతుకులు, గోతులు వున్న రోడ్లపై పోట్ట కూటి కోసం నిత్యం సంచరించే వాహనదారుడిని బాదడమే లక్ష్యం అన్నట్లుగా వుంది కొత్త వాహన చట్టం అంటూ నెటిజనులు ఎన్నో విమర్శలు చేస్తూనే వున్నారు. రోడ్లు బాగుచేసి.. ఇబ్బంది లేని ప్రయాణం సాగేట్టుచూసిన తరువాత భారీ జరిమానాలను ప్రవేశపెట్టండని కోరుతున్నా.. అటు ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ ఆలకించడం లేదు.

కొత్త వాహనచట్టం అమల్లోకి రావడంతో పోలీసులు తమ పని తాము కానిచ్చేస్తున్నారు. అయితే తమిళనాడులోని తిరుపూర్ పోలీసులు మాత్రం మరో అడుగుముందుకేసీ మరీ వాహనదారులకు ఛలానాను ఎస్ఎంఎస్ ద్వారా పంపుతున్నారు. ఇందులో విశేషమేముంది అంటారా.? కారును నడిపుతున్నా హెల్మెట్ పెట్టుకోవాలని, హెల్మెల్ లేని కారణంగా కారు చోదకుడికి జరిమానా విధించారు. వినడంతోనే విస్తుపోతున్నారా.? నిజమే.. కారు నడిపినా హెల్మెల్ పెట్టుకోవాల్సిందేనట. లేదంటే జరిమానా తప్పదట. ఇది తిరుపూర్ పోలీసుల తీరు.

ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరుప్పూరులోని ఎన్ఆర్కే పురానికి చెందిన ఎం సెల్వ కుమార్ స్థానికంగా ఓ బనియన్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బెంగళూరు నుంచి తిరుప్పూరు వచ్చారు. ఆయన మొబైల్ కు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఓ సందేశం వచ్చింది. అందులో కారు నంబరు పేర్కొంటూ.. ఈ కారు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించనందుకు జరిమానా చెల్లించాలని ఆ మెసేజ్ సారాంశం. ఇది చూసిన సెల్వకుమార్ కారు డ్రైవింగ్ కు హెల్మెట్ కు సంబంధం ఏంటో తెలియక తికమకపడ్డాడు.

కారులో వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా ఏంటంటూ నివ్వెరపోయారు. బహుశా పోలీసులు తాను కారు నడుపుతూ సీటు బెల్టు పెట్టుకోలేదని ఈ నోటీసులు జారీ చేశారా అంటే.. తాను నిత్యం బెల్టు పెట్టుకుంటానని అతను పేర్కోన్నాడు. ఇక తాను పోలీసులు పేర్కోన్న తేదీలో కారుపై ధారాపురానికి వెళ్లనేలేదని అన్నారు. ఇక బైక్ నడుపుతున్నప్పుడు చూసి ఈ మెసేజ్ పెట్టివుంటారా.? అని భావించాడానికి వీలు లేదు.. ఎందుకంటే పోలీసులు నోటీసులో పేర్కోన్న రిజిస్ట్రేషన్ నెంబరు కారుదే కానీ అతని బైక్ ది కాదు. దీంతో తనకు అనవసరంగా పోలీసులు నోటీసులు జారీ చేశారని, ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని సెల్వకుమార్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Traffic Rules  M Selvakumar  traffic cops  Helmet  Car driving  NRK Puram  dharapuram  Tirupur  Tamil Nadu  Crime news  

Other Articles