Karnataka: Buses Torched, Schools Shut With DK Shivakumar Arrest కర్నాటకలో ఉద్రిక్తం.. బస్సుల దహనం.. పాఠశాలల మూసివేత

Protests erupt in parts of karnataka over ed arrest of congress leader dk shivakumar

DK Shiva kumar arrest, Congress bandh call, congress activists, Siddaramaiah, KumaraSwamy, ED, bengaluru, vendetta Politics, BJP, BS Yediyurappa, congress, DK Shivakumar, Enforcement Directorate, kanakapura, karnataka, money laundering, protests, ramanagaram, strike, karnataka, crime

Buses were torched and schools and colleges shut as a precautionary measure as the Karnataka Congress called for a state-wide bandh to protest against the arrest of its troubleshooter DK Shivakumar by the Enforcement Directorate under the Prevention of Money Laundering Act (PMLA).

కర్నాటక బంద్లో ఉద్రిక్తం.. బస్సుల దహనం.. పాఠశాలల మూసివేత

Posted: 09/04/2019 12:48 PM IST
Protests erupt in parts of karnataka over ed arrest of congress leader dk shivakumar

కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పలు చోట్ల రాస్తారోకోలు, రోడ్డు బ్లాక్ చేయడంతో కర్ణాటక వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. అనేక చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి  ధర్నాలు, నిరసనలు చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు సాగుతున్నాయంటూ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. డికే శివకుమార్ ను మనీలాండరింగ్ కేసులో క్రితం రోజున అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

కాగా, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, కుమారస్వామి మద్దతు కూడా లభించడంతో వారు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు డికే శివకుమార్ మద్దతుదారులు మరింత రెచ్చిపోయారు. రామనగర్ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు యాజమాన్యాలు. బెలగావి-బగల్కోట్ జాతీయ రహదారిని బంద్ చేశారు ఆందోళనకారులు. టైర్లను నిప్పుపెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు శివకుమార్ ఫ్యాన్స్. రామనగర్ జిల్లాలోని చాలా బస్ డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. కొన్ని ప్రాంతాల్లో బస్సులకు నిప్పు పెట్టారు.

ఆందోళనలకు భయపడిన వ్యాపారులు కొన్ని ప్రాంతాల్లో దుకాణాలను స్వచ్చంధంగా మూసివేశారు. శివకుమార్ అరెస్టు ప్రభావం అటు సినిమా ధియేటర్లపైనా పడింది. ధియేటర్ యాజమాన్యాలు స్వచ్చంధంగా షోలు రద్దు చేశాయి. డీకే శివకుమార్ అరెస్ట్ ను ఆయన సోదరుడు సురేష్ తీవ్రంగా ఖండించారు. శివకుమార్ అరెస్టు కేవలం కక్ష సాధింపు చర్య అని చెప్పుకొచ్చారు. ఈ అరెస్టుతోశివకుమార్ ప్రజాదరణను తగ్గించాలన్న కుట్ర జరుగుతోందని, ఆయనపై అవినీతిపరుడు అన్న ముద్రవేసేందుకు కేంద్రం చేస్తున్న యత్నాల్లో భాగంగానే అరెస్టులు సాగుతున్నాయని విమర్శించారు.

ప్రతిపక్షం నేతలను ఇలా భయాందోళనకు గురిచేయడం.. వారిని ఎన్నికలలో పోటీ చేయనీయకుండా అడ్డుకెునే కుట్రలు, కుయుక్తులు సాగుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. సీఐఎస్ఎఫ్, ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల అదుపులో ఉన్నారని వెల్లడించారాయన. కలుసుకోవటానికి కూడా అనుమతి ఇవ్వటం లేదని ప్రకటించారాయన. ఆందోళనలు, నిరసనలపై కర్నాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ గుండూరావు స్పందించారు. శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారాయన. డీకే శివకుమార్ ను ఆరోగ్యం నిలకడగా ఉందని, కోర్టులో హాజరుపరుస్తామని ప్రకటించారు అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles