benefits in opening post office savings account పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ తెరిస్తే.. లాబాలే.!

Benefits in opening post office savings account

Savings Account, post office savings account, bank savings account, minimum balance, cheque book, atm card, post office vs banks, post office savings scheme, postal savings account, post office account

Do you know the benefits of savings account in post office and want to open the same, here is all you need to do.

పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ తెరిస్తే.. లాబాలే.!

Posted: 08/09/2019 09:20 PM IST
Benefits in opening post office savings account

బ్యాంకుల కన్నా పోస్టాఫీసుల మేలు. వీటిల్లో డబ్బు డిపాజిట్ చేయడం వల్ల ఎక్కువ వడ్డీ పొందొచ్చు. అలాగే భద్రతకు కూడా ఎలాండి ఢోకా లేదు. పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించాలంటే కేవలం రూ.20 ఉంటే సరిపోతుంది. పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతా తెరవొచ్చు. ఏడాదికి 4 శాతం వడ్డీ పొందొచ్చు.

పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు..

* నగదు రూపంలో డబ్బులిచ్చి ఈ అకౌంట్‌ను ప్రారంభించొచ్చు.
* చెక్ బుక్ ఫెసిలిటీ లేని అకౌంట్‌దారులు ఖాతాలో కనీసం రూ.50ను మినిమమ్ బ్యాలెన్స్ కింద కలిగి ఉండాలి.
* అదే చెక్ బుక్ కలిగి ఉంటే మినిమమ్ బ్యాలెన్స్ రూ.500. అకౌంట్‌లో కనీసం ఈ మొత్తాన్ని కలిగి ఉండాలి.
* చెక్ బుక్ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎవరికి అవసరమైతే వారు ఈ సేవలు పొందొచ్చు.
* అకౌంట్‌పై పొందిన వడ్డీపై పన్ను మినహాయింపు ఉంది. ఏడాదిలో రూ.10,000 వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు.
* ఖాతాకు నామినేషన్ సౌకర్యం కూడా ఉంది. అకౌంట్ ప్రారంభించేటప్పుడు లేదా తర్వాత అకౌంట్‌కు నామినీని చేర్చుకోవచ్చు.
* అకౌంట్‌ను ఒక పోస్టాఫీస్ నుంచి మరొక పోస్టాఫీస్‌కు మార్చుకోవచ్చు. ఒక పోస్టాఫీస్‌లో ఒకే అకౌంట్‌ను తెరవగలం.
* పిల్లల పేరుపై కూడా అకౌంట్ తెరవొచ్చు. అలాగే జాయింట్ అకౌంట్ సౌలభ్యం కూడా ఉంది.
* అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలంటే మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్కసారైనా అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేయాలి. లేదంటే విత్‌డ్రా అయినా చేసుకోవాలి.
* సింగిల్ అకౌంట్‌ను జాయింట్‌ అకౌంట్‌గా.. జాయింట్ అకౌంట్‌ను సింగిల్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు.
* ఏటీఎం ఫెసిలిటీ అందుబాటులో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles