Beer consumption hits the roof in Telangana 400 లక్షల కేసులకు పైగా లాగిస్తున్న ‘బీర్’బలులు

Telangana chugged lakhs of bottles of beer per day during this year

beer, beer consumption, summer, Summer in Telangana, summer beer consumption, record sales of beer in Telangana, telangana excise department, Telangana, liquor sales, Hyderabad, Telangana

Telanganites are chugging 30 to 31 lakh bottles of beer per day this summer. The State consumed around 88 to 90 lakh cases of beer in March and 90-92 lakh cases in April. This is an all time record in beer consumption in the State.

'బీర్'బలుల డిమాండ్ భళా.. తయారీ కంపెనీలు డీలా.!

Posted: 05/28/2019 02:43 PM IST
Telangana chugged lakhs of bottles of beer per day during this year

ఎండా కాలం వచ్చిందంటే చాలు బీర్ బలులు రెచ్చిపోతుంటారు. మద్యం ప్రియులు కూడా మధ్యాహ్నం బీరు లాగించి.. సాయంత్రం వేళ్లల్లో మద్యాన్ని సేవిస్తున్నారు. ఇక తెలంగాణలో ఇంతకుమునుపెన్నడూ లేని విధంగా చల్లని బీరు రికార్టును అధిగమిస్తూ.. హాటు కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో బీరు కొరత ఏర్పడిందంటే బీరుబలుల వేసవిలో బీరుతో ఎంత ఉపశమనం పొందుతున్నారో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలంగాణ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన వేళావిశేషమేమిటో గాని.. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కురుస్తోంది. ఇక వేసవికాలం రాగానే బీరు అమ్మకాలు ప్రభుత్వానికి బోనస్ గా మారుతున్నాయి. 2015-16లో ఏడాదికి 336 లక్షల బీరు కేసుల అమ్మాకాలను సాగిస్తున్న తెలంగాణ ఏక్సైజ్ శాఖ.. 2016-17 వచ్చే సరికి అమ్మాకాలను అమాంతం 360 లక్షల కేసులకు పెంచేసుకుంది. ఇది 2017-18 సంవత్సరానికి వచ్చే సరికి 390 లక్షల కేసులను తాకింది. ఇక ఈ ఏడాది ఏకంగా నాలుగు వందల లక్షల కేసులను దాటి 450 లక్షల కేసుల మార్కును కూడా తాకుతుందని అంచనా..

అయితే బీరుబలుల డిమాండ్ తగ్గట్టుగా బీరు తయారీ కంపెనీలు వాటిని తయారు చేయడం లేదని దీంతో అందనంత ఎత్తుకు ఎదిగే బీరుబలుల మార్కుకు తయారీ కంపెనీల ఉత్పత్తి లేమి కారణంగా అందుకోలేకపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీరుబలుల సంఖ్య పెరుగుతుండటం, గతంలో మాదిరిగా ఒక్కటి కాకుండా రెండు అపైన లాగించడంతో.. బీర్ల అమ్మాకాలకు రెక్కలు వచ్చాయని అంటున్నారు దుకాణదారులు. మాములుగా అయితే రోజుకు 150–200 కేసుల బీర్లు అమ్మే సామర్థ్యం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం బీర్ల ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో మద్యం డిపోల్లో రేషన్‌ విధానం అమలు చేస్తున్నారు.

షాపుకు కేవలం 30నుంచి 50 కేసుల బీర్లు మాత్రమే ఇస్తున్నారు. ఈ బీర్లు వచ్చిన రెండు గంటల్లోపే అమ్ముడవుతున్నాయి. దీంతో బీర్లుకు మాత్రమే అమ్మకాలు వుండటం. మధ్యానికి అంతగా విక్రయాలు సాగించకపోవడంతో.. సాయంత్రం వరకు బీరుబలులు వేచిన తరువాతే బీరుకు ప్రత్యామ్నాయంగా మద్యం సేవిస్తున్నారని, మద్యం విక్రయాల లైసెన్సుదారులు చెబుతున్నారు. దీంతో గిరాకీని వదులుకునే ఇష్టం లేక తాము కూడా మనిషికి ఒక్క బీరు మాత్రమే విక్రయించక తప్పడం లేదని అంటున్నారు.

అయితే వైన్ షాపులను ఓనర్ల కోసం బీర్ అండ్ రెస్టారెంట్ కోటాలోని బీర్లను కూడా వీరికి మళ్లిస్తున్నా.. డిమాండ్ ను అందుకోలేకపోతుంది ఎక్సైజ్ శాఖ. దీంతో బార్లకు వెళ్లి బీరు తాగాలనుకున్న వారికి కూడా డిమాండ్ వున్న బీర్లు అందుబాటులో వుండటం లేదు. డిమాండ్ తక్కువగా వున్న కంపెనీల బీర్లు మాత్రమే అందుబాటులో వుంటున్నాయి.  బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో బీర్లు సేవించే వారి సంఖ్య తక్కువగా వున్నా.. వారు కోరుకున్న బ్రాండ్ బీర్ అందుబాటులో వుండటం లేదని బీరుబలులు చెబుతున్నారు. తెలంగాణలో మొత్తంగా 17 బెవరీస్ కంపెనీలు.. తెలంగాణ బవరేజస్ కార్పోరేషన్ లిమిటెడ్ నేతృత్వంలో నడుస్తున్నాయి.

వేసవి కారణంగా సింగూరు జలాశయంలో నీటినిల్వలు బాగా తగ్గిపోయాయని, మళ్లీ వర్షాలు పడి భూగర్భజలాల్లో నీటి పెరుగుదల కనిపిస్తేనే బీర్ల తయారీ ఊపందుకునే అవకాశం ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. నీటికొరత కారణంగానే బీర్ల కొరత ఏర్పడిందని, మళ్లీ నీళ్లు పుష్కలంగా వస్తే తప్ప బీర్లను సరఫరా చేయలేమని అధికారులు చెబుతున్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను పక్కన బెడితే.. ఈ గణంకాలను పరిశీలిస్తే.. ఏడాదికేడాది పెరుగుతున్న బీర్ల అమ్మకాలు.. బీరుబలుల తెలంగాణగా మారిందనే చెప్పకతప్పదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beer  summer  summer beer consumption  record sales  liquor sales  Hyderabad  Telangana  

Other Articles