Man, cousin sisters tied to tree and thrashed ధార్ లో ఆటవిక రాజ్యం.. చెట్టుకు కట్టేసి చితకబాదిన వైనం..

Mp man elopes with married woman is tied to tree and thrashed

man tried to tree, dhar man tied to tree beaten up, dhar news, madhya pradesh news, madhya pradesh crime news, madhya pradesh police, couple beaten up in madhya pradesh, couple tied to a tree and beaten, pocso act, mp police, crime

A man and his two cousin sisters were tied to a tree and severely beaten for several hours by around nine persons in Madhya Pradesh's Dhar district after he allegedly eloped with a married woman,

ITEMVIDEOS: మధ్యప్రదేశ్ ధార్ లో ఆటవిక రాజ్యం.. చెట్టుకు కట్టేసి చితకబాదిన వైనం..

Posted: 05/16/2019 06:21 PM IST
Mp man elopes with married woman is tied to tree and thrashed

మధ్యప్రదేశ్ లో మరోమారు ఆటవిక రాజ్యం నడుస్తోందని మరో ఘటనతో నిరూపితమైంది. ఓ కుటుంబానికి ముగ్గురిని గ్రామస్థులు చెట్టుకు కట్టేసి గంటల తరబడి వారిని చేతికందిన వాటితో చావచితకబాదారు. వీరిలో ఓ చిన్నారి కూడా వున్నా కనీస కనికరం చూపించలేదు గ్రామస్థులు. ఇంత జరుగుతున్న గ్రామంలోని కొందరు మౌన ప్రేక్షకుల మాదిరి చోద్యం చూస్తున్నారే తప్ప.. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా వారిని విడిపించేందుకు ప్రయత్నించలేదు. ఇక గ్రామంలోని కొందరు యువకులు ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో బంధించేందుకు పోటీ పడ్డారే తప్ప.. దాడి చేస్తున్నవారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలోని అర్జున్ కాలనీలో జరిగింది. స్థానికంగా ఉండే ముఖేష్ అనే వ్యక్తి వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆ మహిళతో కలిసి పారిపోయాడు. దీంతో మహిళ భర్త ధహి పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత ముఖేష్ తో తన భార్య పారిపోవడానికి కారణంగా అనుమానిస్తున్న అతని సోదరుడి ఇంటికి వెళ్లి.. మిమల్ని పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెడతారని.. మర్యాదగా తన భార్య ఎక్కడుందో చెప్పాలని బెదిరించాడు. అప్పుడు ఇంట్లో మగవాళ్లు లేకపోవడంతో.. ఈ విషయంలో తమ ఇంటికి వస్తే రాజీ కుదుర్చుకుందామని, మీకు పోలీసుల భయం కూడా వుండదని చెప్పాడు.

దీంతో ధహి మాటలు విశ్వసించిన ఆ కుటుంబం, పోలీసుల బాధ పోతుందన్న యోచనతో తమ అన్నయ్య రాగానే అతనికి విషయాన్ని చెప్పి.. ధహి ఇంటికి తీసుకెళ్తారు. వారు రాగానే ధహి తన బంధువులను, ఇరుగుపోరుగులను పిలిచి వారి సాయంతో వారిని చెట్టుకు కట్టేసి.. వారిని చావచితకగొట్టారు. గంటల కొద్దీ సమయం గడుస్తున్నా.. ఒకరి తరువాత మరోకరు వారిపైబడి ఏకంగా తొమ్మిది గంటల పాటు వారిని చితకకొట్టారు. ఈ వీడియోలను నెట్టింట్లో అప్ లోడ్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి దాడి చేసిన వారిలో ఐదుగురిని అరెస్టు చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు. వీరిపై పలు సెక్షన్లతో పాటు పోస్కో చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Revanth reddy vs uttam kumar reddy in telangana congress

  తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్తమ్ వర్సెస్ రేవంత్..!

  Sep 18 | హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి, పిసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య అంతరాన్ని పెంచుతుందా.? అంటే అవునే అన్నట్లు వున్నాయి రేవంత్ రెడ్డి తాజా... Read more

 • Thousands participated in kodela siva prasada rao last journey

  కోడెల అంతిమయాత్ర.. జనసంధ్రమైన సత్తెనపల్లి

  Sep 18 | ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర ఆయన స్వగృహమైన కోట నుంచి బయలుదేరింది. రెండు కిలోమీటర్ల దూరంలో వున్న స్వర్ణపురిలో ఆయన... Read more

 • Jagan forms ttd trust board appoints party mp yv subba reddy its chairman

  టీటీడీ బోర్డు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం 23న

  Sep 18 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేసింది. ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిపి 28మందికి అవకాశం కల్పించింది.. ఈ మేరకు పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి 8మంది.. తెలంగాణ 7గురు.. తమిళనాడు నుంచి 4..... Read more

 • Death toll in ap tourist boat mishap rises to 28

  గోదావరి నదిలో బోటు ఎక్కడుందో తెలిసింది.. కానీ..

  Sep 18 | గోదావరిలో జరిగిన ఘోర దుర్ఘటనలో ఇప్పటికీ గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే వున్నాయి. ఆదివారం రాత్రి  ఈ దుర్ఘటన జరుగుగా మూడు రోజులు కావస్తున్నా ఇంకా గల్లంతైన వారి కోసం అన్వేషణ... Read more

 • Pawan kalyan suggests to read vanavasi book

  పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: పవన్ కల్యాణ్

  Sep 18 | నల్లమల అడువుల పరిరక్షణ, యురేనియం తవ్వకాలను వ్యతిరేకించి పర్యావరణ పరిరక్షించుకుందామని తన జనసేన పార్టీ అధ్వర్యంలో అఖిలపక్ష సమవేశాన్ని నిర్వహించిన జనసేనాని పవన్ కల్యాన్.. అఖిలపక్ష సమవేశంతో తన పని ముగిసిందని కాకుండా.. రాష్ట్రప్రజలను... Read more

Today on Telugu Wishesh