PM Modi criticised for cloud cover jet escape comment ప్రధాని ‘మేఘాల చాటు’ సూచనపై విపక్షాల విమర్శలు

Opposition takes jibe at modi for cloud can help jets escape radar comment

modi radar, pm modi on radar, radar clouds, radar comments, cloud cover jet escape comments, narendra modi interview, pm modi news nation interview, narendra modi interview, congress on modi radar, NC on PM radar, pdp on modi radar comments, viral news, social media

Taking a jibe at PM Modi for his remark that he had suggested that clouds and rain could prevent Pakistani radars from detecting Indian fighter jets during Balakot air strike, Oppostion parties critisice him during the last phase of elections.

ప్రధాని ‘మేఘాల చాటు’ సూచనపై విపక్షాలు, నెట్ జనుల విమర్శలు

Posted: 05/13/2019 01:36 PM IST
Opposition takes jibe at modi for cloud can help jets escape radar comment

సార్వత్రిక ఎన్నికలలో పూల్వామా ఘటన గురించి వ్యాఖ్యలు చేయవద్దని ఆంక్షలు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రధాని నరేంద్రమోడీ సహా బీజేపి నేతలు ప్రచారాస్త్రాంగా విరివిగా వినియోగిస్తున్న బాలాకోట్‌ సర్జికల్ స్ట్రైక్ అంశంపై ఇప్పటికే విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తాము లేవనెత్తిన ప్రతీ అంశంలో ప్రధాని మోడీకి, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు ఈసీ క్లిన్ చిట్ ఇవ్వడంపై విపక్ష నేతలు ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈసీ సహా సుప్రిం కూడా తాము జోక్యం చేసుకోలేమన్న తేల్చిచెప్పడంతో రెట్టించిన ఉత్సాహంతో బాలకోట్ దాడుల అంశాన్ని మరింతగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని భావించారు ప్రధాని. బాలకోట్ దాడు వ్యూహరచనలో తన పాత్ర గురించి గొప్పగా చెప్పకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రధాని అవగాహనారాహిత్యంలో పలు వ్యాఖ్యలు చేశరంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అంతేకాదు నెట్ జనుల చేతిలో ఆయన ట్రాల్ అవుతున్నారు. బాలాకోట్ దాడుల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు తిప్పలు తెచ్చిపెట్టాయి.

అసలాయన చేసిన వ్యాఖ్యలు ఏమిటీ అంటే.. మబ్బుల చాటున యుద్ధ విమానాలు నడపడం ద్వారా పాకిస్థాన్‌ రాడార్ల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని వాయుసేనకు సలహా ఇచ్చానని, ఆ ప్రకారమే వాయుసేన ప్రతికూల వాతావరణంలో పాకిస్థాన్ పై దాడి చేసిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలను విపక్షాలతో పాటు నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి రాడార్ల పనితీరును మేఘాలు ప్రభావితం చేయలేవు. మేఘాలు దట్టంగా అలుముకున్న సమయంలో కూడా వాతావరణంలో రాడార్లు పనిచేస్తాయి. అయితే మోడీ మాత్రం ఇందుకు విరుద్ధంగా చెప్పడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మేఘాలు దట్టంగా ఉన్నా, అవతల ఏముందో పసిగట్టేందుకే రాడార్ టెక్నాలజీ రేడియో తరంగాలను వాడతారని, ఆరోజు బాలాకోట్​ ఏరియాలో మేఘాల వల్ల ఐఏఎఫ్​కి ఎలాంటి అదనపు ఉపయోగం లేదని పలువురు రాడార్​ నిపుణులు చెబుతున్నారు.

‘‘జుమ్లా(మోసపూరిత మాటలు) చెప్పడం మోడీకి అలవాటే. గడిచిన ఐదేండ్లుగా ఆయన చేస్తున్నది అదే. మేఘాలు అడ్డున్నా, రాడార్లకు చిక్కకుండా మోసం చేస్తూనే ఉన్నారు’’ అంటూ కాంగ్రెస్ విమర్శించింది.

‘‘నేషనల్​ సెక్యూరిటీ ఎంత కీలకమైందో తెలిసి కూడా దాని విలువను తగ్గించేలా మోడీ మాట్లాడారు. బాధ్యతారాహిత్య కామెంట్లతో  దేశభద్రతకు డ్యామేజ్​ చేశారు. ఇందుకాయన సిగ్గుపడాలి. ఇలా మాట్లాడే వ్యక్తి ప్రధానిగా ఉండటానికి అనర్హుడు’’ అంటూ సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘మేఘాలు అడ్డుంటే పాకిస్థాన్​ రాడార్లు పనిచేయవన్న సీక్రెట్​ మోడీ మాటలతో బయటపడింది. భవిష్యత్తులో దాడులకు పనికొచ్చే అంశమిది. అన్నట్టు, బీజేపీ ట్వీట్లు ఏమైనట్లు? మేఘాల్లో కలిసిపోయాయా?’’ అంటూ ఎన్సీ నేత ఒమర్​ అబ్దుల్లా అన్నారు.

‘‘బాలాకోట్​పై దాడుల్ని ప్రశ్నించినప్పుడు నాపై దెమ్మెత్తిపోశారు. ఇప్పుడు మోడీ చెప్పిన క్లౌడ్​ థియరీ పాకిస్థాన్​ విమర్శనాస్త్రంగా మారింది. మన భద్రతా బలగాలకు ఇంత అవమానం అవసరమా అన్నదే నా బాధ’’  అంటూ పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ విమర్శించారు. అంతటితో ఆగని అమె మరో అడుగు ముందుకేసి.. ఆర్జీకి ఏమీ తెలియదని అభివర్ణిస్తూ పప్పును అని అతన్ని అపహాస్యం చేయడంలో అర్థమేలేదని డొంకతిరుగుడు వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles