Telangana: 10 labourers die in mudslide at Narayanpet మట్టిదిబ్బెలు పడి 10 మంది కూలీల దుర్మరణం..

10 killed in narayanpet after being buried under mound of mud

10 killed telangana, workers killed telangana, Telangana’s Narayanpet, Telangana, Narayanpet, workers buried alive, Narayanpet, Mudslide, NREGA Labourers, labourers die, Telangana, Crime

Ten people including some woman labourers working under the MNREGA scheme were killed when a huge mound of mud fell on them at a worksite in Narayanpet district Wednesday, police said.

మట్టిదిబ్బెలు పడి 10 మంది కూలీల దుర్మరణం..

Posted: 04/10/2019 04:39 PM IST
10 killed in narayanpet after being buried under mound of mud

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ కొత్త జిల్లా నారాయణపేట జిల్లా మరికల్‌ మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మరికల్ మండలం తీలేరులో ఈ ఘోరం జరిగింది. ఉపాధి హామీ పనులలో పనిచేస్తున్న 10 మంది కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషయంగా వుంది. అయితే ఈ దుర్ఘటన నుంచి మరో ముగ్గురు మహిళలు తృటితో తప్పించుకున్నారు. ఈ గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని.. ఈ పనుల కోసం 15 మంది వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఉపాధి హామీ పనుల్లో భాగంగా తీనేరు గ్రామ శివార్లలో చెరువు తవ్వకాలు పనులు జరుగుతున్నాయి. బాగా లోతుగా పనులు చేపట్టారు. జేసీబీలతో తవ్వకాలు చేపట్టారు. కింద ఉండి కూలీలు పనులు చేస్తుండగా.. పై నుంచి మట్టిదిబ్బలు పడ్డాయి. పెద్దపెద్ద దిబ్బలు కావటంతో కూలీలు అందరూ వాటి కింద చిక్కుకుపోయారు. మట్టితోపాటు రాళ్లు కూడా పడ్డాయి. దీంతో ఘటనా స్థలంలోనే 10 మంది కూలీలు చనిపోయారు. గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పనుల్లో జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఈ ఘటన జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని గ్రామస్థులు, మృతుల బంధువులు అరోపిస్తున్నారు. 20 నుంచి 25 అడుగుల లోతులో పనులు జరుగుతున్నాయి. అంతెత్తు నుంచి మట్టిదిబ్బలు, రాళ్లు పడటంతో వెంటనే వారిని కాపాడలేకపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. పనుల్లో జాగ్రత్తలు తీసుకోకపోవటం, యంత్రాలతో ఇష్టమొచ్చినట్లు పనులు చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్న కలెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించనున్నారు.

చనిపోయిన కూలీలు అందరూ మరికల్ మండలం తీనేరు గ్రామస్తులుగా చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ నేతలు వెళ్లి పరిశీలించటానికి ఇబ్బందిగా మారింది. అయితే, మృతులంతా మహిళలే కావడం గమనార్హం. ఎండ ఎక్కువగా ఉండడంతో వీరంతా గుట్టలాంటి ప్రదేశంలో సేద తీరుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతులు వీరే..
1)పి. అనురాధ(30)
2) బీమమ్మ(40)
3) బుడ్డమ్మ(26)
4) బి.లక్ష్మి(28)
5) కె. లక్ష్మి(30)
6) మంగమ్మ(32)
7) అనంతమ్మ(45)
8) కేశమ్మ(38)
9) బి. అనంతమ్మ(35)
10) లక్ష్మి (28)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narayanpet  Mudslide  NREGA Labourers  labourers die  Telangana  Crime  

Other Articles