revanth reddy lashesout at CM KCR in open letter to EC దొరల పెత్తనం.. అధికారుల దాసోహం: ఈసీకి లేఖలో రేవంత్

Revanth reddy lashesout at cm kcr in open letter to ec

Revanth reddy fires on CM KCR, Revanth reddy slams CM KCR, Revanth reddy Election commission, Revanth reddy KCR, Revanth reddy EC open letter, Revanth reddy malkajgiri lok sabha, Telangana CM, Revanth reddy, Telangana, politics

Malkajgiri Lok Sabha congress candidate Revanth reddy lashes out at CM KCR and TRS leaders in an open letter written to Eelection commission, who are focring congress leaders and followers to join TRS or else put them behind bars with fake cases.

దొరల పెత్తనం.. అధికారుల దాసోహం: ఈసీకి లేఖలో రేవంత్

Posted: 04/08/2019 07:13 PM IST
Revanth reddy lashesout at cm kcr in open letter to ec

మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు అధికార పార్టీ టీఆర్ఎస్ కు దాసోహమవుతూ అన్ని విధాలా వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనాలకు అనుమతులు ఉన్నప్పటికీ ఎన్నికల అధికారులు కుంటిసాకులు చెబుతూ తమను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తరఫున ప్రచారానికి దిగొద్దని మద్దతుదారులు, కార్యకర్తలను బెదిరిస్తున్నారని వాపోయారు.

ఈ మేరకు రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈరోజు బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ లో చేరాలని కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని లేఖలో రేవంత్ రెడ్డి తెలిపారు. తమ మాట వినకపోతే అక్రమ కేసులు పెడతామని టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు రాత్రి 10 గంటల వరకూ అనుమతి ఉన్నప్పటికీ సాయంత్రం 7 గంటలకే ప్రచారం ముగించాలని ఒత్తిడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇలా బెదిరిస్తున్న టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఎన్నికల అధికారిని కోరారు. ఈ ఎన్నికలలో 16 మంది ఎంపీలను గెలిపించాలని ప్రజలను కోరుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 14 మంది ఎంపీలతో గత ఐదేళ్లలో కేంద్రం నుంచి సాధించినదేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ అంతా ఎన్నికల ముందు నాటకమని.. ఎన్నికలు ముగియగానే బీజేపితో జతకడతారని ఆయన జోస్యం చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth reddy  Malkajgiri lok sabha  Election commission  open letter  KCR  Telangana  politics  

Other Articles