Pawan Kalyan targets YS Jagan జైలుకెళ్లివచ్చిన మీరు మహాత్ముడివా.? జగన్ పై పవన్ ఫైర్..

Pawan kalyan targets ys jagan asks are you mahatma gandhi

pawan kalyan, janasena, Pawan Kalyan YS Jagan, Pawan Kalyan JaganMohan Reddy, YS Jagan Mahatma Gandhi, pawan kalyan JanaSena, andhra pradesh, politics

Actor turned politician Janasena party chief Pawan Kalyan targets YS Jagan Mohan Reddy in Election campaign, questions him whether is he a mahatma gandhi for being behind the bars for two years.

జైలుకెళ్లివచ్చిన మీరు మహాత్మాగాంధీయా.? జగన్ పై పవన్ ఫైర్..

Posted: 03/27/2019 05:14 PM IST
Pawan kalyan targets ys jagan asks are you mahatma gandhi

జనసేన పార్టీని టీడీపీ పార్టనర్ అంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడిన జనసేన అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అక్రమాస్థుల కేసులో రెండేళ్ల పాటు జైలులో ఉండోచ్చిన మీరు ఏమన్నా మహాత్మా గాంధీయా.? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో పవన్ మాట్లాడుతూ, "జగన్ మాట్లాడితే, నన్ను ‘యాక్టర్’ అంటారని, అయితే అది ముమ్మాటికీ నిజమే.. నేను యాక్టర్నే.. యాక్టర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనపై చూపిన అభిమానంతోనే తానింతవాణ్ని అయ్యానని అన్నారు.

యాక్టరుగానే మొదలైన తన ప్రస్థానం పవర్ స్టార్ వరకు చేర్చిందని, అయినా అది తనకు తృప్తినివ్వలేదని ఆయన చెప్పారు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రజలకు తాను ఏదేనా చేద్దామనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన ఆయన.. ప్రజల కోసం.. యువత కలలు కంటున్న మార్పు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. యువతకు పాతికేళ్ల భవిష్యత్తును అందించేందుకనే వచ్చానని చెప్పారు. అయితే మరి, రెండు సంవత్సరాలు జైల్లో ఉండొచ్చిన మీరు మహాత్మాగాంధీయా? మీరు ఏం చేశారు? ఎందుకని జైలులోకి వెళ్లివచ్చారు.?" అని ప్రశ్నించారు.

"అలాగే జగన్ మాట్లాడితే నన్ను ‘టీడీపీ పార్టనర్’ అంటారు. అసలు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరి పార్టనర్ అనాలి? మోదీ పార్టనరా? అమిత్ షా పార్టనరా? టీఆర్ఎస్ పార్టనరా?" అని ప్రశ్నించారు." ఈ ముగ్గురితో పార్టనర్ అయిన జగన్ మోహన్ రెడ్డికి తానొకటి చెబుతున్నా, తాను యాక్టర్ నే. తాను చదువుకుంది పదో తరగతే. కానీ, తన చదువు ఆపలేదు. పబ్లిక్ పాలసీల గురించి తాను చదువుకుంటూనే ఉన్నా. ఏం తెలియకుండా, అర్థం చేసుకోకుండా రాజకీయాల్లోకి మేము వస్తామా? ఈ తరానికి అండగా ఉండేందుకు వచ్చాను" అని పవన్ కల్యాణ్ ధీటుగా సమాధానం ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  YS Jagan  mahatma gandhi  andhra pradesh  politics  

Other Articles