ED raids office, residential premises of Chanda Kochhar, Dhoot చందాకొచ్చర్, దూత్ ఇళ్లఫై ఈడీ దాడులు

Ed raids office residential premises of chanda kochhar dhoot

Enforcement Directorate, Chanda Kochhar, ICICI Bank Videocon loan case, Central Bureau of Investigation, Deepak Kochhar, Venugopal Dhoot, Videocon Industries Limited, NuPower, kochhar, videocon loan case, raid at chanda kochhar house, chanda kochhar news

The Enforcement Directorate (ED) on carried out raids in homes and offices of Chanda Kochhar, former Chief Executive Officer (CEO) and Managing Director of ICICI Bank, in the Videocon loan case.

చందాకొచ్చర్, వేణుగోపాల్ దూత్ ఇళ్లఫై ఈడీ దాడులు

Posted: 03/01/2019 01:00 PM IST
Ed raids office residential premises of chanda kochhar dhoot

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందకొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ సంస్థల అధినేత వేణుగోపాల్ దూత్ ల చుట్టూ వీడియోకాన్-ఐసిఐసిఐ బ్యాంకు కేసుకు సంబంధించిన కేసులో ఉచ్చు బిగుసుకుంటుంది. ఇటీవల వీరి కార్యాలయాలు, ఇళ్లపై సీబిఐ అకస్మిక దాడులు చేయగా, తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి వీరి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ అధికారులు అకస్మిక తనిఖీలు చేస్తున్నారు.

తన భర్త దీపక్ నిర్వహిస్తున్న నుపవర్ రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లాభం చేకూరిన తరువాత విడియోకాన్ గ్రూప్ నకు ఐసిఐసిఐ బ్యాంకు లాభం కలిగేలా రుణం మంజూరు చేసినట్లు అభియోగాలు వచ్చిన నేపథ్యంలో చంద కొచ్చర్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంది. చందకొచ్చరి నివాసం, ఐసీఐసీఐ బ్యాంకు, నూపవర్ కార్యాలయాల్లో ఈ ఉదయం నుంచి ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) దాడులు జరుపుతోంది.

దీపక్ కొచ్చర్ నివాసంతో పాటు, ముంబై, ఔరంగాబాద్ లోని వేణుగోపాల్ ధూత్ ఇంటిపై, మ్యాట్రిక్స్ గ్రూప్, ఫస్ట్ లాండ్ హోల్డింగ్స్ కార్యాలయాల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. కాగా, సీబీఐ ఇప్పటికే కొచ్చర్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ఆమె భర్త దీపక్ కొచ్చర్ తో పాటు వేణుగోపాల్ దూత్‌లపై ఉన్న సర్క్యూలర్లను పునరుద్ధరిస్తూ అన్ని విమానాశ్రాయలకు పంపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ED  Chanda Kochhar  ICICI Bank Videocon loan case  CBI  Deepak Kochhar  Venugopal Dhoot  NuPower  

Other Articles