rahul gandhi targets modi again on rafale ప్రధాని మోడీని అనుకరించిన రాహుల్..!

Narendra modi ji used to speak like this rahul gandhi mimics pm

Rahul Gandhi, Rahul Gandhi Mimics PM Modi, Narendra Modi, Rafale aircraft, BJP, Congress, Uttar pradesh, politics

Congress president Rahul Gandhi demonstrated in full public view on the Rafale deal controversy, he gave a freestyle speech in which he was seen mimicking the hand gestures and body movements of PM Modi.

ITEMVIDEOS: రాఫెల్ పై మరోమారు ప్రధానిని టార్గెట్ చేసిన రాహుల్..!

Posted: 02/12/2019 06:23 PM IST
Narendra modi ji used to speak like this rahul gandhi mimics pm

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. రాఫెల్ డీల్ పై ఆయన మాట్లాడుతూ, ఈ డీల్ లో అనిల్ అంబానీకి మధ్యవర్తిగా మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశ భద్రత విషయంలో మోదీ రాజీ పడ్డారని దుయ్యబట్టారు. ఢిల్లీలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తన స్నేహితుడు అనిల్ అంబానీకి మేలు చేసేందుకు మోదీ యత్నించారనే విషయానికి సంబంధించి ప్రతి రోజు ఏదో ఒక విషయం వెలుగులోకి వస్తోందని రాహుల్ అన్నారు. రూ. 30వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమయిందని చెప్పారు. రాఫెల్ డీల్ గురించి రక్షణ మంత్రికి, రక్షణ శాఖకు కూడా తెలియదని... కేవలం మోదీకి, అనిల్ అంబానీకి మాత్రమే తెలుసని అన్నారు.

ఇది కేవలం అవినీతికి మాత్రమే సంబంధించిన అంశం కాదని... దేశ రహస్య చట్టానికి సంబంధించిన అంశం కూడా అని చెప్పారు. ఒక వ్యక్తి కోసం దేశ భద్రతనే పణంగా పెట్టారని విమర్శించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయని అన్నారు. ఈ అంశంలో అవినీతి, డీల్ జరిగిన తీరు, దేశ భద్రతలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ క్షమించరాదని చెప్పారు.

మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు కూడా రాహుల్ హాజరై, సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, యాంటీ కరప్షన్ క్లాజ్ ను మోదీ తొలగించారంటూ ఓ పత్రికలో కథనం వచ్చిందని చెప్పారు. దేశానికి కాపలాదారుడైన వ్యక్తి దొంగగా మారారంటూ విమర్శించారు. ఇక క్రితం రోజున యూపీలో తన సోదరి ప్రియాంకగాంధీతో కలసి ర్యాలీ నిర్వహించిన రాహుల్.. అనంతరం జరిగిన సభలో ప్రధాని మోడీని అనుకరిస్తూ.. ఆయన హావభావాలు గత ఎన్నికలకు ప్రస్తుతానికి చాలా మార్పులు సంభవించాయని అవి ఎలానో ప్రదర్శించి.. అందరినీ ఆకట్టుకున్నాడు.

మోదీ చెయ్యి ఎలా తిప్పుతారు? ఆయన శరీర కదలికలు ఎలా వుంటాయో అనుకరిస్తూ చూపించారు. "గతంలో నరేంద్ర మోదీ ఇలా మాట్లాడేవారు... ఇలా... ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు" అంటూ మోదీ హావభావాలను అనుకరించే ప్రయత్నం చేశారు. "సోదర సోదరీమణులారా... అనిల్ అంబానీ ఎవరో నాకు తెలియదు. ఆయనకు నేను ఎన్నడూ 20 వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదు" అని ఆయన అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles