Geeta Mehta Declines Padma Shri అవార్డును తిరస్కరించిన సీఎం సోదరి గీతా మెహెతా

Writer gita mehta naveen patnaik s sister turns down padma shri

gita mehta, naveen patnaik, padma shri, gita mehta padma shri, gita mehta turns down padma shri, gita mehta foreigner, padma shri, union government, ministry of Home, parliament general elections, politics

Odiya origin author Geeta Mehta declined the Padma Shri for distinguished contribution to literature and education, explaining the honour may be “misconstrued… with a general election looming”.

అనువుగాని సమయమని.. అవార్డును తిరస్కరించిన రచయిత్రి

Posted: 01/26/2019 02:37 PM IST
Writer gita mehta naveen patnaik s sister turns down padma shri

ప్రముఖ రచయిత్రి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి గీత మెమతాకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. సాహిత్యంలో ఆమె చేసిన సేవకు గాను పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. అయితే అవార్డు ప్రకటనపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం తనకు అందివ్వాలనుకుంటున్న ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. న్యూయార్క్‌లో ఉంటున్న ఆమె దీనికి సంబంధించి ఓ ప్రెస్‌ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు.

మోదీ సర్కార్ అవార్డు ప్రకటించిన సమయం సరైంది కాదని అందుకే పద్మశ్రీని తిరస్కరిస్తున్నానని ఆమె ఓ స్థానిక వెబ్ సైట్లో పేర్కొన్నారు. ‘నన్ను పద్మశ్రీ అవార్డుకు అర్హురాలుగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. అయితే... సాధారణ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇలా అవార్డుల్ని ప్రకటించడం సరైన సమయం కాదని నేను భావిస్తున్నానను, అందుకే కేంద్రం ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న పద్మశ్రీ అవార్డును తిరస్కరిస్తున్నాను.

ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించి ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేస్తుంది. నాకు ఈ విషయం చాలా ఇబ్బంది కలిగించింది. దీనికై నేను విచారం వ్యక్తం చేస్తున్నానని.. ’మెహతా ప్రకటనలో పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ కేంద్రంలో హంగ్ ఏర్పడితే... మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈసారి ఒడిశా బీజేడీ ( బిజు జనతాదళ పార్టీ)తో జతకట్టాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సోదరి గీత మెహతాకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిందని రాజకీయవర్గాలు సమాచారం. బీజేడీ మద్దతు కోసమే మోదీ సర్కార్ వ్యూహాత్మకంగా గీతమెహతాకు అవార్డు అందించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడామె పద్మశ్రీని తిరస్కరించడంతో నమో సర్కార్ సందిగ్ధంలో పడిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles