Boeing Successfully Tests 'Flying Car' ఫ్లయింగ్ కారును విజయవంతంగా పరీక్షించిన బోయింగ్

Boeing s self flying car has taken its first flight

Boeing, aviation,aerospace, aircraft,airplanes, innovation, flight, technology, engineering, Commercial Airplanes, PassengerAirVehicle, PAV, , air taxi, flying taxi, drone taxi, electric vertical takeoff, personal aircraft. personal air vehicle. urban air taxi, uber air, Aurora Flight Sciences, eVTOL Air Taxi, Electric VTOL Aircraft, urban mobility, autonomous flight

A prototype of Boeing's autonomous passenger air vehicle completed a controlled takeoff, hover and landing during the test conducted in Manassas, Virginia.

ITEMVIDEOS: ఫ్లయింగ్ కారును విజయవంతంగా పరీక్షించిన బోయింగ్

Posted: 01/24/2019 12:51 PM IST
Boeing s self flying car has taken its first flight

సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటూ.. ప్రస్తుతం పట్టణ రవాణా రంగంతో పాటు బట్వాడా రంగంలోనూ భవిష్యత్తులో అత్యంత కీలకం కానున్న సరికొత్త వాహనాన్ని రూపొందించిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ దానిని తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. ఫ్లయింగ్ కార్ ప్రొటోటైప్ ను సిద్ధం చేసిన బోయింగ్, దాన్ని తొలిసారిగా ప్రయోగించింది.

ప్రపంచంలోనే అత్యధికంగా విమానాలను తయారు చేస్తున్న సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న బోయింగ్, ఈ వాహనంతో అర్బన్ ట్రాన్స్ పోర్టేషన్, డెలివరీ సేవలు మరింత సులభమవుతాయని చెబుతోంది. ఎయిర్ బస్ వంటి సంస్థలతో పోటీ పడుతూ, ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలు చేసే బోయింగ్, ఇప్పుడు నిట్టనిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేయడంతో పాటు రోడ్డుపై కారులా, ఆపై గాల్లో విమానంలో ప్రయాణించే వాహనాన్ని తయారు చేసింది.

30 అడుగుల పొడవు (9 మీటర్లు) ఉండే ఈ వాహనం, హెలికాప్టర్, డ్రోన్, కారు, విమానాల మేళవింపు. నేలపై నుంచి నిట్టనిలువుగా గాల్లోకి ఎగురుతుంది. విమానంలా దూసుకెళ్లి, రన్ వే లేకుండానే సులువుగా ల్యాండ్ అవుతుంది. దీన్ని వర్జీనియాలోని మనాసాస్ విమానాశ్రయంలో తొలిసారిగా పరీక్షించామని, అది విజయవంతం అయిందని బోయింగ్ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles