seven thousand graduates apply for 13 waiter posts! 13 వెయిటర్ పోస్టులకు 7 వేల మంది పోటీ..!

Seven thousand graduates apply for 13 waiter posts

7 thousand graduates, 13 waiter posts, maharashtra secretariat, canteen waiters, fourth pass, Dhananjay Munde, state government, jobless situation, Social media, Politics

7 thousand graduates applied for 13 posts of canteen waiters which qualification is 4th class in Maharashtra Secretariat. A government official said that a written examination of 100 marks was held recently for these posts.

నిరుద్యోగ భారతం: 13 వెయిటర్ పోస్టులకు 7 వేల మంది పోటీ..!

Posted: 01/22/2019 10:17 AM IST
Seven thousand graduates apply for 13 waiter posts

నిరుద్యోగ భారతమంటూ దశాబ్దాల క్రితం నుంచి వస్తున్న సమస్య రానురాను మరింత పెద్దదిగా మారింది. ఎంతలా అంటే నాలుగో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల ఉద్యోగాలకు ఏకంగా డిగ్రీ పట్టా పుచ్చుకున్నవారు దరఖాస్తు చేసుకున్నేంత. అంతేకాదు కేవలం 13 పోస్టుల కోసం ధరఖాస్తులు అహ్వానిస్తే ఏకంగా ఏ వేల మంది నిరుద్యోగులు పోటీ పడ్డారంటే సమస్య తీవ్రత ఎంతలావుందో మరోసారి స్పష్టమైంది.

కష్టపడి పీజీలు, డిగ్రీలు చేసినా జాబ్స్ దొరకడంలేదు. దీంతో నిరుద్యోగులు ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా అప్లై చేసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా వెయిటర్ పోస్ట్ కు కూడా భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. మహరాష్ట్ర సెక్రటేరియట్ మంత్రాలయంలోని క్యాంటీన్‌ లో ఇటీవల 13 వెయిటర్ పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దానికి 7 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పైగా వారిలో నూటికి తొంబై శాతం మంది గ్రాడ్యుయేట్లు అవడం గమనార్హం.

ఈ ఉద్యోగానికి నాలుగో తరగతి పాస్ అయిన వాళ్లు అర్హులు. ఉద్యోగం దొరక్క చేశారో ..లేదా సెక్రటేరియట్‌లో ఉద్యోగం అనుకుని చేశారో తెలియదు కాని.. ఈ న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాలుగో తరగతి పాస్ అయిన వాళ్లు అర్హులని నోటిఫికేషన్‌ లో తెలియజేశామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. వంద మార్కులతో కూడిన పరీక్షను నిర్వహించామని, తర్వాత సెలక్షన్ చేసిన 13 మందిలో 12 మంది గ్రాడ్యుయేషన్ చేయగా..ఒకరు మాత్రం ఇంటర్మీడియట్ చదివారని తెలిపారు. 25 నుంచి 27 ఏళ్ల వయసున్న 8 మంది అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలను సెలక్ట్ చేసినట్టు తెలిపారు.

దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ చేసిన వారు వెయిటర్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారంటే..దేశంలో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమౌతోందని కామెంట్స్ చేస్తున్నారు. నాలుగో తరగతి అర్హతకు ఇంతమంది చదువుకున్న వారు దరఖాస్తు చేసుకోవడం బాధాకరమైన విషయమని.. గ్రాడ్యుయేషన్ చేసిన వారి చేతులతో టీ, బిస్కెట్లు అందిస్తే వాటిని మంత్రులు ఎలా తీసుకుంటారని కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 7 thousand graduates  13 waiter posts  maharashtra secretariat  canteen waiters  

Other Articles