BJP Back In Lead In Madhya Pradesh After Initial Scare ఉత్కంఠకు తేరలేపిన మధ్యప్రదేశ్ ఓటరు

Bjp back in lead in madhya pradesh after initial scare

five state assembly elections results, assembly elections results 2018, Madhya pradesh, Shivraj Singh Chouhan,Madhya Pradesh Assembly Elections 2018,Madhya Pradesh Assembly Polls,Madhya Pradesh Assembly polls 2018,Madhya Pradesh Assembly Polls Results,Kamal Nath, national politics

The ruling BJP and the Congress are caught in a close fight in Madhya Pradesh, where Chief Minister Shivraj Singh Chouhan is seeking a record fourth term. While the Congress looked set for a win in early leads, it is the BJP which is ahead now.

ఉత్కంఠకు తేరలేపిన మధ్యప్రదేశ్ ఓటరు

Posted: 12/11/2018 11:56 AM IST
Bjp back in lead in madhya pradesh after initial scare

మినీ భారత పోరాటంలో ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడటంతో.. ఓటరు తీర్పు అన్ని రాష్ట్రాల్లో సుస్పష్టంగా వున్నా అత్యంత కీలకంగా మారిన మధ్యప్రదేశ్ లో మాత్రం ఓటరు తీర్పు ఎప్పటికప్పుడు కీలకంగా మారుతూ.. అన్ని పార్టీల అభ్యర్థులను ఉత్కంఠకు గురిచేసింది. మిగిలిన రాష్ట్రాల్లో ప్రీ-పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించినట్లు ఫలితాలు కూడా వస్తున్నాయి. అయితే అది నుంచి మధ్యప్రదేశ్ లో మాత్రం అటు సర్వే సంస్థలు, ఇటు ఓటరు తీర్పు కూడా ఉత్కంఠకు గురిచేస్తుంది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నాలుగో పర్యాయం విజయాన్ని సాధించారు. ఈ రాష్ట్రంలో సుమారుగా 75 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నా.. ప్రభుత్వ వ్యతిరేకత వుందా..? లేదా.? అన్న విషయంలో మాత్రం ఓటరు తీర్పు స్పష్టంగా లేకపోవడంతో అటు పార్టీ అభ్యర్థులు కలవరానికి గురవుతున్నారు. ఈ రాష్ట్రంలో గెలుపోటములు ప్రధాన పార్టీలైన అధికార బీజేపి, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య దోబూచులాడుతుంది.

తొలుత కౌంటింగ్ ప్రారంభమైన సమయంలో మధ్యప్రదేశ్ అధికార విపక్ష పార్టీల మధ్య పోటీ తీవ్రంగా వుండింది. అయితే ఒక దశలో బీజేపి అతిపెద్ద పార్టీగా అవరించిందన్న వార్తలు రాగా, మరికొద్ది సేపట్లో ఆ వార్తలు తారుమారయ్యాయి. అధికార పార్టీని మించిన స్థానాలను కైవసం చేసుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఇక్కడ ఒక దశలో బీజేపి 115 స్థానాలను కైవసం చేసుకోగా, మరో మారు కాంగ్రెస్ ఆ సంఖ్యను అందుకుంది.

మొత్తంగా 230 స్థానాలు వున్న మధ్యప్రదేశ్ లో అధికారం అందుకునే కావాల్సిన మ్యాజిక్ ఫిగఱ్ 116 కాగా, అధికార బీజేపి, కాంగ్రెస్ పార్టీలు ఆ ఫిగర్ అందుకోవడంలో పోటాపోటీని ప్రదర్శిస్తున్నాయి. ఇక్కడ ఏడు స్థానాలను కైవసం చేసుకున్న బీఎస్పీ పార్టీ ఎవరికి మద్దతును ప్రకటిస్తే వారే అధికారాన్ని హస్తగతం చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. పార్టీ ఏదన్న అంశంలో పార్టీలు ఇతర పార్టీల అభ్యర్థులను, స్వతంత్రులను కలుపుకునేందుకు ఇప్పటి నుంచే బీజేపి నేతలు ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఇందుకోసం బీజేపి అధిష్టానం నుంచి ఇప్పటికే దూతలు రంగంలోకి దిగినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles