Cong ahead in MP, Rajasthan, Chhattisgarh మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా.. తెలంగాణలో కారు జోరు..

Cong ahead in mp rajasthan chhattisgarh kcr gamble pays off in telangana

five state assembly elections results, assembly elections results 2018, Madhya pradesh, Rajasthan, chattisgarh, mizoram, Telangana, national politics

One hour into counting of votes in crucial assembly elections in five states, the Congress is ahead in Madhya Pradesh, Rajasthan and Chhattisgarh, and the ruling TRS has raced ahead in Telangana,

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా.. తెలంగాణలో కారు జోరు..

Posted: 12/11/2018 10:13 AM IST
Cong ahead in mp rajasthan chhattisgarh kcr gamble pays off in telangana

మినీ భారత పోరాటంలో కాంగ్రెస్ తన సత్తా చాటుకుంటుంది. ఉత్తరాదిలోని మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా దూసుకెళ్తుండగా, దక్షిణాదిలోని తెలంగాణలో మాత్రం కారు జోరు కొనసాగుతుంది. ఇవాళ వెలువడుతున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ఆరంభమైంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్ లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతతో కోనసాగుతుంది.

తెలంగాణలో టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉండగా, మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ ఆధిక్యత చూపుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం... రాజస్థాన్‌లో మొత్తం 199 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ప్రస్తుతం కాంగ్రెస్ 100, బీజేపీ 77 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. బీజేపీ నేత, సీఎం వసుంధరారాజే సింధియా తన నియోజకవర్గమైన జట్రపలాన్‌లో ఆధిక్యంలో ఉన్నారు. మాజీ సీఎం, కాంగ్రెస్‌నేత అశోక్‌ గహ్లోత్‌ సర్దార్‌పురా నుంచి పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ పోటీ చేసిన టోంక్‌ నియోజకవర్గం నుంచి ముందంజలో ఉన్నట్టు సమాచారం.

ఇక, మధ్యప్రదేశ్ లోనూ కాషాయపార్టీ వెనకంజలో వుంది. ఇక్కడ ఇరు పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ఆధిక్యత చూపుతున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ అందిన సమాచారం ప్రకారం బీజేపీ 101, కాంగ్రెస్ 114 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. చత్తీస్‌గఢ్‌లో మాత్రం బీజేపీ 23, కాంగ్రెస్ 58 చోట్ల ఆధిక్యతలో వున్నాయి. తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు గానూ టీఆర్ఎస్ 88 స్థానాల్లోనూ, కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి 18 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. మిజోరాంలో మిజోనేషనల్ ఫ్రంట్ 24, కాంగ్రెస్ 10 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : assembly elections results 2018  Madhya pradesh  Rajasthan  chattisgarh  mizoram  Telangana  Politics  

Other Articles