devotees throng shiva temples on karthika ekadasi శైవక్షేత్రాలకు కార్తీక శోభ..

Karthika somavaram and ekadasi devotees throng shiva temples

Devotees, Karthika Masam, karthika Ekadasi, karthika ekadasi on monday, shiva temples, devotees of telugu states, Telangana, Andhra Pradesh

Special pujas were performed at all Siva temples across the telugu states on Monday on the occasion of auspicious karthika ekadasi and kathika somavaram.

శైవక్షేత్రాల్లో భక్తుల సందోహం.. మిన్నంటిన శివనామస్మరణం..

Posted: 11/19/2018 01:26 PM IST
Karthika somavaram and ekadasi devotees throng shiva temples

అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు ఒక విశిష్టత వుంది. ఈ మాసంలోని సోమవారాల్లో భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో ఉపవాస దీక్షలు కూడా ఆచరిస్తారు. ఇక అదే సోమవారపు రోజుల్లో ఏకాదశి కూడా వస్తే.. ఇక ఆ రోజున భక్తులకు పరశించిపోతారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇవాళ కార్తీమ రెండో సోమవారంతో పాటు ఏకాదశి కూడా కలసిరావడంతో తెలుగురాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

రాజమండ్రీలో గోదావరి ఘాట్లు భక్తులతో పోటెత్తాయి. సామర్లకోట, పిఠాపురం తదితర ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ద్రాక్షారామం భీమేశ్వరాలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో వ్రత మండపాలు కిటకిటలాడాయి. తెలగు రాష్ట్రాలలోని అన్ని దేవాలయాల్లో ఓం నమ: శివాయ అన్న నామస్మరణలను మారుమ్రోగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా శైవక్షేత్రాలన్నీ ముకంటి నామస్మరణతో మారుమోగాయి. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు.

శివాలయాల్లో మహిళా భక్తులు కొందరు కొందరు భక్తులు 365 ఒత్తుల దీపాలను వెలింగించగా, మరోకొందరు ఉసిరికాయ దీపాలను వెలిగించి కార్తీక దీపారాధన చేశారు. ఆది దంపతులను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం, ఏకాదశి కావడంతో భక్తులు అధికంగా తరలివచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపారాధన చేశారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, ఉమామహేశ్వర వ్రతాలు నిర్వహించారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజశ్వేరస్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయంలో భక్తుల రద్దీ కారణంగా ఆర్జిత సేవలు రద్దు చేశారు. వరంగల్ లోని వేయిస్తంభాల గుడిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karthika Masam  karthika Ekadasi  shiva temples  devotees  telugu states  Telangana  Andhra Pradesh  

Other Articles